అనంతపురం

హనుమజ్జయంతి ఉత్సవ పోస్టర్ విడదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, మే 17 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హనుమజ్జయంతికి సంబంధించిన పోస్టర్లను ఆలయ అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎఇఓ ధనుంజయ మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా పాంచాహ్నిక దీక్ష, హనుమజ్జయంతి యాగ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న స్వామివారికి పూలంగిసేవ, తులసీ దళాలతో లక్షార్చన, 28న శ్రీగంధసేవ, తమలపాకుల లక్షార్చన, 29న తులసీమాల అలంకరణ, సింధూర అలంకారం, 30న అష్టోత్తర కలశాభిషేకం, వడమాల అలంకరణ సింధూర లక్షార్చనలు, 31న తోమాల విశేష పుష్ప అలంకరణ, స్వర్ణవజ్ర కవచ అలంకారం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనాథ్‌గౌడ్, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యురాలు సుగుణమ్మ, ఆలయ ప్రధాన అర్చకులు వసుధరాజాచార్యులు, సూపరింటెండెంట్ పాల్గొన్నారు.