అనంతపురం

పుష్ప మండపంలో దర్శనమిచ్చిన చెన్నకేశవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, మే 17: పట్టణంలోని లక్ష్మిచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు మంగళవారం ఉదయం ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భానుప్రకాష్‌లు స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి పుష్ప మండపంలో వుంచి పట్టణంలో ఊరేగింపు జరిపారు. ఇందుకు ఉభయ దాతలుగా దివంగత చెన్నకేశవులు, కుమారుడు ప్రసాద్, దివంగత సోలిగాళ్ళ బాలకృష్ణ, సోలిగాళ్ళ వెంకటేసులు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు నారికేళాది ఫల పుష్పాలను శ్రీవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈఓ నరసింహరాజు నేతృత్వంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
శాస్త్రోక్తంగా శ్రీవారి కల్యాణం...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఆలయంలో అర్చకులు నిర్వహించారు. గజనాణ్యం పట్టుశాలి సంఘం పాగాల అశ్వర్థనారాయణ కుమారులు రఘు, మురళి, జనార్ధన్‌లు ఉభయ దాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం హిందూ ధర్మం ప్రకారం శ్రీవారి ఎదురుకోళ్ళు, కళ్యాణాన్ని వేదమంత్రాలు, మేళ తాళాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కల్యాణాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. అనంతరం శ్రీవారికి భక్తులు కానుకలు అందజేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.