అనంతపురం

సమాజసేవలో భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మే 17: విద్యార్థులను క్షేత్రస్థాయి నుంచే సామాజిక సేవారంగంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేయాలని రాష్ట్ర పౌర సంబంధాలు సమాచార, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో నీరు-చెట్టు, ఇంకుడు గుంతలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ నీరు- చెట్టు కార్యక్రమాన్ని రాష్ట్ర సిఎం చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ముఖ్యంగా నీటి సంరక్షణ పనులను చేపట్టేందుకు రాష్ట్రంలో పంట సంజీవని, నీరు-చెట్టు, ఇంకుడు గుంతలు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో విద్యార్థులను భాగస్వామ్యులను చేసి కరవు రహిత అనంత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ దోహదపడాలన్నారు. భూగర్భ జలాలు జిల్లాలో బాగా అడుగంటిపోయి 14 సంవత్సరాలుగా కరవు దాపురించిన ఘటనలు ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం జిల్లాలో ఆరు వేల ఫారంపాండ్లు, 3 లక్షల ఇంకుడు గుంతలను నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకుపోతోందన్నారు. ఇందులో ప్రభుత్వ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, సామాజిక బాధ్యతతో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థులను ఉన్నత విద్య వైపు ఆసక్తి చూపేలా ప్రిన్సిపాల్స్ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని కోరారు. ఈ యేడాదిలో ఇంటర్ ఫలితాలు కొంతవరకు ఆశాజనకంగా వున్నా మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐఓ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజారావు పాల్గొన్నారు.