అనంతపురం

వైద్యులు చిత్తశుద్ధితో సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిట, మే 17: వైద్యులు చిత్తశుద్ధితో రోగులకు సేవలను అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నిద్ర అనంతరం మంగళవారం ఉదయం కలెక్టర్ కోన శశిధర్‌తో కలసి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని మంత్రులు పరిశీలించారు. గైనిక్‌వార్డు, ప్రత్యేక నవజాత శిశు చికిత్స కేంద్రం, పీడియాట్రిక్ జనరల్ వార్డు, పీడియాట్రిక్ ఐసియు, న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో డాక్టర్లు బాగా వైద్యం అందిస్తున్నారా, సౌకర్యాలు బాగున్నాయా, మందులు ఇస్తున్నారా, భోజనం పెడుతున్నారా లేదా అని మంత్రులు రోగులను అడిగి తెలుసుకున్నారు. సిటి స్కాన్ మిషన్ పనిచేయడం లేదని తెలుసుకున్న మంత్రి కామినేని శ్రీనివాస్ ఎంఆర్‌ఐ, సిటి స్కాన్, మమ్మెగ్రఫీ పరికరాలను మంజూరు చేయాలని అదనపు డిఎంఇ బాబ్జీను ఆదేశించారు. మరో 3 నెలల్లో జిల్లాకు వస్తానని, ఆలోపు ఈ పరికరాలన్నింటిని ఏర్పాటు చేయాలన్నారు. రోగుల వెంట వచ్చే వారి పర్యవేక్షకులకు షెడ్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. త్వరలో జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంఖుస్థాపన చేస్తామన్నారు. 500 పడకల స్థాయికి ఆసుపత్రిని తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అవసరముందని త్వరలో వారిని నియమిస్తామన్నారు. అనంతరం హెచ్‌ఓడిలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి సిఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, డాక్టర్లు రోగులకు మంచి సేవలందించాలని సూచించారు. ప్రతి వార్డులో ఏర్పాటుచేసిన సిసి కెమెరాల ద్వారా వార్డులో ఏమి జరుగుతోందో రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పరిశీలించవచ్చునన్నారు. డాక్టర్లు అందరు కష్టపడి పనిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు. ప్రతి వారం సమావేశాలు ఏర్పాటుచేసుకుని మీ పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. హెచ్‌ఓడిలు డ్యూటీ ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో ఒకసారి మీ వార్డుకు వెళ్లి పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, జెడ్పి ఛైర్మన్ చమన్‌సాబ్, పెనుకొండ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి, బిజెపి జిల్లా అధ్యక్షుడు జె.అంకాల్‌రెడ్డి, నాయకులు లలిత్‌కుమార్, అదనపు డిఎంఈ బాబ్జీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నీరజ, ఆర్‌ఎంఓ వైవి.రావు, ఆసుపత్రిలోని అన్ని విభాగపు అధిపతులు పాల్గొన్నారు.