అనంతపురం

జూన్ 21 నుంచి ఇంటింటికీ ఇంటర్‌నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మే 17: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే క్రమంలో నూతన టెక్నాలజీని అలవరుచుకుని జిల్లా అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డిఆర్‌సి సమావేశంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, విఫ్ యామినీ బాలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నూతన టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు. గతంలో టిడిపి ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా ప్రభుత్వం దశల వారీగా అమలుచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో వున్నారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు సిఎం సానుకూలతను వ్యక్తం చేశారని, ఇందులో సాంకేతికపరమైన సమస్యలు వుండడంతో కొంత జాప్యం జరుగుతోందన్నారు. క్రమబద్ధీకరణ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మవద్దని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ జూలై 21 నుండి ప్రతి ఇంటింటికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పిస్తోందని, అందుకు తగిన చర్యలు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో పండ్ల తోటలు పెంపకమే వ్యవసాయానికి ప్రత్యామ్నాయ పంట అన్నారు. కరవు జిల్లా అయిన అనంతపురం జిల్లా అభివృద్ధి రేటు పెరగడానికి పండ్ల తోటలే కారణమన్నారు. ప్రతి సంవత్సరం పండ్ల తోటల ఆదాయం ద్వారా లక్షా నలభై వేల హెక్టార్లలో 3,600 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. దీన్ని వచ్చే యేడాదికి 4,600 కోట్లకు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. హంద్రీ-నీవాను సకాలంలో పూర్తి చేయడానికి సిఎం కృతనిశ్ఛయంతో ఉన్నాడన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో ప్రతి అధికారి పాలుపంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతి అధికారి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బి.కె.పార్థసారిథి, ప్రభాకర్‌చౌదిరి, హనుమంతరాయచౌదరి, చాంద్‌బాషా, ఎమ్మెల్సీ శమంతకమణి, డా.గేయానంద్, తిప్పేస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.