అనంతపురం

వైభవంగా శ్రీవారి బ్రహ్మ రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, మే 19: స్థానిక లక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మ రథోత్సవం గురువారం భక్తిప్రపత్తుల మధ్య సాగింది. అశేష జనవాహిని చేసిన గోవింద నామ స్మరణలతో ధర్మవరం హోరెత్తింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహరాజు నేతృత్వంలో ఈ వేడుకలు పర్వదినాన్ని తలపించాయి. గురువారం ఉదయం 7:30 గంటలకు ఆలయం నుండి అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భానుప్రకాష్‌లు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పల్లకిలో ఊరేగింపుగా తేరు వద్దకు మేళతాళాల మధ్య తీసుకెళ్ళారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను తేరుపై అమర్చి తిరిగి పూజలు నిర్వహించి మహా మంగళహారతి ఇవ్వగానే గోవింద నామస్మరణలతో భక్తులు మడుగుతేరును కొద్ది దూరం లాగారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ బాలానాయక్, డిఎస్‌పి వేణుగోపాల్, జడ్జి లీలావతి, తహశీల్దార్ నారాయణమూర్తి, మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగమోహన్ తదితరులతోపాటు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు ఫల పుష్పాలను, మిరియాలు తదితర వాటిని రథంపైకి విసిరి మొక్కులు తీర్చుకోగా అధిక సంఖ్య లో భక్తులు రథంపైకి ఎక్కి శ్రీవారిని కనులారా తిలకించి తన్మయులయ్యారు. సాయంత్రం 4:30గం టల ప్రాంతంలో బ్రహ్మ రథోత్సవాన్ని భ క్తులు గోవిందా... గో విందా... అని స్మరిస్తూ అంజుమాన్ సర్కిల్ దాకా తేరును లాగారు. కొద్దిసేపటి తర్వాత బ్రహ్మ రథోత్సవం గమ్యస్థానాన్ని చేరింది. ధూళోత్సవంతో గురువారం నాటి కార్యక్రమాలు ముగిశాయి. శ్రీవారి బ్రహ్మరథోత్సవ సందర్భంగా పట్టణంతోపాటు పరిసర గ్రామాలు, ప్రాంతాల నుండి విచ్చే యు అశేష భక్త జనావళిని దృష్టిలో వుంచుకుని పలు సంఘాలు, పార్టీలు, సేవా సం స్థలు భక్తులకు పలు సౌకర్యాలను క ల్పించాయి. టిడిపి ఆధ్వర్యంలో ఎ మ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సౌజన్యంతో టిడిపి వారు మజ్జిగ కేంద్రం ద్వారా భక్తులకు మజ్జిగను అందించగా యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ప్లాస్టిక్ విసన కర్రలను పంపిణీ చేశారు. ఏపి రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం, మజ్జిగను, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, టౌన్‌బ్యాంక్, ఆర్యవైశ్య సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వినియోగం గావించారు. తొ గటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నీటి ప్యాకెట్లను సరఫరా చేశారు. కాగా శ్రీవారి రథోత్సవ సందర్భంగా హాజరయ్యే వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిఎస్‌పి వేణుగోపాల్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక నిఘా వుంచి నేరాలను అ దుపు చేస్తూ బందోబస్తు నిర్వహించారు.