అనంతపురం

700 ఎకరాల భూమి కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం రూరల్, మే 27 : ఎస్సీ నిరుపేద మహిళల కోసం భూమి కొనుగోలు పథకం కింద జిల్లాలో 700 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం రాయదుర్గం పరిధిలోని రాయదుర్గం గుమ్మఘట్ట, డి.హీరేహాల్ మండలాల్లో ఎంపిక చేసిన భూమిని పరిశీలించారు. అనంతరం స్థానిక అథితి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 300 ఎకరాల భూమిని పరిశీలించి కొనుగోలు చేసేందుకు ఎంపిక చేశామన్నారు. మిగిలిన భూమిని పరిశీలించాల్సి ఉందన్నారు. ఒక్కో నిరుపేద ఎస్సీ మహిళకు రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామన్నారు. రాయదుర్గం మండలం గ్రామదట్లలో 14, గుమ్మఘట్ట మండలంలోని పులకుంటలో 12.40, డి.హీరేహాల్ మండలంలోని కాదలూరులో 12, కూడ్లూలో 6, బొమ్మనహాళ్ మండలంలోని ఉంతకల్లులో 18, కణేకల్లులోని జక్కలవడికిలో 35 ఎకరాల భూమిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపిక చేసిన భూమిని వ్యవసాయానికి ఆమోదయోగ్యమా కాదా అనే విషయాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం డి.హీరేహాల్ మండలంలో జరిగిన గ్రీవెన్స్‌డేలో పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామారావు, తహశీల్దార్లు ఖాతీజున్ కుఫ్రా, సుబ్రహ్మణ్యం, మారుతి, వెంకటశేషు, అబ్జల్‌ఖాన్ పాల్గొన్నారు.