అనంతపురం

విత్తనం పంపిణీ వద్ద రైతుల తోపులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, మే 27 : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విత్తన పంపిణీలో రైతుల మధ్య శుక్రవారం తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తతత చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి రైతులను బెదరగొట్టారు. చాలామంది రైతులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాశారు. అయితే విత్తన నిల్వలు తక్కువగా ఉన్నందు వల్ల ఉదయం విత్తనం కోసం ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట చోటు చేసుకుంది. వీరి మధ్యలో ఇరుక్కున్న మహిళలు, వృద్ధులను పోలీసులు బయటకు లాగారు. మరికొంత మంది అడ్డువచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఎస్‌ఐ జనార్ధన్ నాయుడు జోక్యం చేసుకుని ఈరోజు ఇచ్చిన కూపన్లకు మరుసటి రోజు బస్తాలు ఇస్తామని సర్దిచెప్పారు. గూళపాళ్యం, కమలపాడు గ్రామాల రైతులకు 936 మందికి కూపన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఒ లీలావతి మాట్లాడుతూ విత్తనం కోసం నగదు చెల్లించిన రైతులకు స్టాక్ రాగానే విత్తన పంపిణీ చేస్తామన్నారు.