అనంతపురం

రాయలసీమ దత్తపుత్రుడు మన్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మే 27 : రాయలసీమ అభివృద్ధికి విశేష కృషి చేసిన సర్ థామస్ మన్రో రాయలసీమ దత్తపుత్రుడిగా చరిత్రలో నిలిచిపోయారని జెసి బి.లక్ష్మీకాంతం కొనియాడారు. దత్త మండలాల తొలి ప్రిన్సిపల్ కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్ మన్రో జయంతి వేడుకలను శుక్రవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పెన్నార్ భవన్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సదర్భంగా జెసి-1 బి.లక్ష్మీకాంతం, జెసి-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, సమాచార పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తిమ్మప్ప, నగర కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు మాట్లాడుతూ నిజాయితీ, దార్శనికత, పరిపాలనా దక్షత కలిగిన మన్రో అధికారులకు ఆదర్శ ప్రాయుడన్నారు. తరచూ కరవులకు గురవుతున్న జిల్లాలో విరివిగా మొక్కలు పెంచడం, చెరువులు తవ్వించడం ద్వారా కరవు నివారణకు కృషి చేశారన్నారు. మన్రో విదేశీయుడైనప్పటికీ భారతీయ సంస్కృతిపట్ల అమితమైన గౌరవం ఉండేదన్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి, గండి ఆంజనేయస్వామి, మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేసిన మన్రో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. మ్రనో స్ఫూర్తిగా జిల్లా అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.