అనంతపురం

విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, జూన్ 17 : మండల పరిధిలోని బోగాలకట్ట గ్రామానికి చెందిన వెంకటనారాయణరెడ్డి, యశోద కుమార్తె వెంకటేశ్వరి (22) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంకటేశ్వరి విజయవాడలో ఎంబిఎ రెండో సంత్సవరం చదువుతోంది. కంటి ఆపరేషన్ నిమిత్తం తల్లిదండ్రులు మదురై వెళ్లారు. ఈనేపథ్యంలో శుక్రవారం ఫలితాలు రావడంతో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై కత్తి శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.