అనంతపురం

రైలు కింద పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, జూన్ 17: రాప్తాడుకు చెందిన విద్యార్థి బాబు(19) శుక్రవారం స్థానిక రైల్వేగేటు సమీపంలో రైలు కింద పడి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఉజ్జినప్ప, నల్లమ్మ దంపతులకు ఇద్దరు సంతానం వేణు, బాబు. వేణు గొర్రెలు కాసేవాడు. బాబు పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నల్లమ్మ గొర్రెల వద్దకు వెళ్ళాలని బాబుకు చెప్పడంతో ఇంట్లో గొడవపడ్డాడు. తీవ్రమనస్థాపానికి గురై రైలుకింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళాడు. రైలు దగ్గరకు రాగానే భయపడి వెనక్కు రావడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతు మృతిచెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.