అనంతపురం

ముద్దాయికి ఆరు నెలల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 17 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులో హిందూపురం రూరల్ మండలం బీరేపల్లికి చెందిన ముద్దాయి వడ్డె శివకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక మెజిస్ట్రేట్ ఆనందతీర్థ తీర్పు చెప్పినట్లు వన్‌టౌన్ సిఐ ఇదుర్‌బాషా తెలిపారు. గత 2014 మే 25వ తేదీన వడ్డె శివ ద్విచక్ర వాహనంలో వేగంగా వస్తూ మరో ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తున్న కల్లుబండి గంగప్పను ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా ఇలియాజ్ అనే వ్యక్తి తీవ్ర గాయాలకు గురయ్యాడు. దీనిపై అప్పట్లో వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైం. సంబంధిత కేసు శుక్రవారం విచారణకు రాగా పూర్వపరాలను విన్న న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో ముద్దాయి వడ్డె శివకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని సిఐ ఇదుర్‌బాషా వివరించారు.