అనంతపురం

మున్సిపాలిటీల్లో బదిలీల ఫీవర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 17 : ప్రభుత్వం ఈనెల 20వ తేదీ వరకు మాత్రమే బదిలీలకు అనుమతించడంతో ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. ఎక్కడికి బదిలీ అవుతామో అని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు మున్సిపాలిటీల బదిలీల కౌనె్సలింగ్ శుక్రవారం ప్రారంభం కావడం, ఉద్యోగుల నుండి ఆఫ్షన్‌లు తీసుకుంటుండటంతో ఆందోళన తారాస్థాయికి చేరింది. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు మున్సిపల్ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. అయితే నిబంధనలు కఠినతరంగా ఉండటంతో అల్లాడిపోతున్నారు. ఇదే విషయమై మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం నాయకులు రంగంలోకి దిగారు. గతంలో పనిచేసిన సర్వీసును లెక్కించి కోరుకున్న స్థానాన్ని కేటాయించడానికి నిబంధనలు అంగీకరించవని ఉన్నతాధికారులు పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు సంఘం రా ష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మిని కలిసి సమస్యను విన్నవించారు. ఇదే విషయమై పురపాలక శాఖ రాష్ట్ర డైరెక్టర్ కన్నబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. నిబంధనలపై గందరగోళం ఉందని, స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ నిబంధనల జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లకు వర్తించదని, మేనేజర్ పోస్టు లాంటి ఉన్నత స్థాయి పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చా రు. దీంతో కౌనె్సలింగ్ ప్రారంభమైం ది. ప్రతి ఉద్యోగి నుంచి మూడు ఆఫ్ష న్లు తీసుకుంటున్నారు. ఇకపోతే కొం దరు ఉద్యోగులు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు రాజకీయ నాయకులతో ఉన్నతాధికారులకు సిఫార్సులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొం దరు తమకున్న అండదండల ద్వారా అధికారులతోనే ఉన్నతాధికారులతో మాట్లాడిస్తున్నట్లు సమాచారం. సిఫార్సులు చేయించుకోలేని ఉద్యోగులు మాత్రం ఊసురుమంటున్నారు. మరో వైపు దీర్ఘకాలికంగా ఒకే మున్సిపాలిటీలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను పూర్తిస్థాయిలో బదిలీలు చేస్తున్నారు. దీంతో బిల్ కలెక్టర్లకు స్థాన చలనం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. బదిలీ కావాలంటే మూడేళ్లు తప్పనిసరి పనిచేసి ఉండాల్సిన నిబంధనతో అనేక మంది ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా నిబంధన కారణంగా బదిలీలు లేకుండాపోయాయి. ఇదిలా ఉండగా అనేక మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉండటం, వారి స్థానాల్లోకి జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే బదిలీలు చేస్తే ఉపయోగం ఉంటుందని ఉద్యోగులు భావించారు. అయితే పదోన్నతులు లేకుండానే బదిలీలు పూర్తి చేస్తుండటంతో మింగుడు పడని పరిస్థితుల్లో ఉద్యోగులు కనిపిస్తున్నారు. మరో వైపు త్వరలోనే పదోన్నతులు ఉంటాయని, అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని వాపోతున్నారు. ఏదేమైనా రెండు, మూడు రోజుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అవుతారో తేలి పోనుంది.