అనంతపురం

నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 17 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి సూచించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పాంచజన్య బ్రిలియంట్స్ పాఠశాల వార్షికోత్సవం పాఠశాల అధ్యక్షులు పిఎస్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఎస్ శ్రీనివాసులు కేక్ కట్ చేశారు. అనంతరం చైర్‌పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇష్టపడి చదవాలన్నారు. ముఖ్యంగా ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అలాగే ఉపాధ్యాయులకు పుస్తకాల్లోనే చదువులే కాకుండా ప్రయోగాత్మకంగా విద్యాబోధన సాగించాలన్నారు. తద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరగడంతోపాటు విషయాన్ని మరచిపోకుండా ఉంటారన్నారు. గతంలో తక్కువ ఖర్చుతోనే డిగ్రీలు, పిజిలు చేస్తుండేవారని, ప్రస్తుతం విద్యను కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పాంచజన్య పాఠశాలలో విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు, యోగా, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుండటం పట్ల అభినందించారు. ఇకపోతే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేసి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. పచ్చదనాన్ని పెంపొందించాలని తెలిపారు. పాఠశాల అధ్యక్షులు పిఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు యాజమాన్యంతోపాటు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలు, వివిధ పోటీ పరీక్షల్లో రాణిస్తుండటం గర్వ కారణమన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా ఇందులో భాగంగా స్థానికంగా పాంచజన్య ఆసుపత్రిలో ఉచిత ఇసిజి సేవలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ జెపికె రాము, మండల విద్యాశాఖాధికారి గంగప్ప, కోశాధికారి నందకుమార్, సందీప్, పాఠశాల హెచ్‌ఎం గాయిత్రీ, ఏఓ భాస్కర్, ఎహెచ్‌ఎంలు విజయేంద్ర, శశికళ పాల్గొన్నారు.