అనంతపురం

రైల్వేల ప్రైవేటీకరణ దేశ భద్రతకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జూన్ 17: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైల్వే ప్రైవేటీకరణ విధానాల వల్ల దేశభద్రతకు పెను ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని దక్షిణ మధ్య రైల్వే జోనల్ కార్యదర్శి సిహెచ్ శంకర్రావు అన్నారు. శుక్రవారం స్థానిక డిఆర్‌ఎం కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ల ఎన్‌డిఏ పాలనలో కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కూలీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలు, పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. వీటికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమై ఈనెల 9న కేంద్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగుల వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 7వ వేతన సంఘంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సీనియర్, జూనియర్ సెక్షన్ ఇంజినీర్ల వేతనం సామాన్య ఉద్యోగులతో సమానం చేసిందన్నారు. అలాగే డాక్టర్ వాలెన్ అక్రయిడ్ ఫార్ములా ఆధారంగా కుటుంబానికి సరిపడ వేతనంపై రూ, 7800 సిఫార్సు చేసిందన్నారు. మార్కెట్ ధరలను సక్రమంగా వేయకుండా వేతన నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. 1951లో జరిగిన మొదటి వేతన సంఘంలో 14 శాతం, 1959లో జరిగిన పే కమిషన్‌లో 20 శాతం నుండి 2006లో జరిగిన 6వ పే కమిషన్‌లో 54 శాతం పెంచారన్నారు. అయితే 2016లో విడుదల చేసిన 7 పే కమిషన్‌లో మాత్రం కేవలం 14 శాతం పెంచి చేతులు దులుపుకున్నారన్నారు. జీతాలు అదనంగా పెంచామని పండుగ అడ్వాన్స్‌లు రద్దు చేయడం దారుణమైన విషయమన్నారు. ముఖ్యంగా వివేక్‌దెబ్రాయి కమిటీ సిఫార్సుల అనుగుణంగా రైల్వేను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దీనివల్ల సైనిక దళాలను చేరవేసేందుకు ప్రైవేట్‌పరమైన రైల్వే సహకరించకపోతే దేశ భద్రతకు పెను ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైల్వే ఉద్యోగులు ఐదు రోజులు సమ్మె చేస్తే రవాణా వ్యవస్థ, ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. 10 రోజులు చేస్తే పరిశ్రమలు మూతబడుతాయని, 15 రోజులు చేస్తే దేశమే అతలాకుతలం అవుతుందన్నారు. ఇలా చేయడం వల్ల గతంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. ముందుగా పెద్దఎత్తున రైల్వే కార్మికులు పెద్దఎత్తున ఊరేగింపు నిర్వహించారు. కొన్ని బ్రాంచ్‌లకు చెందిన కార్మికులు బైకు ర్యాలీ నిర్వహిస్తూ డిఆర్‌ఎం కార్యాలయం చేరుకున్నారు. ఈ సభలో మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శి విజయ్‌కుమార్, ఎడిఎస్‌లు ఎస్‌ఎండి గౌస్, మస్తాన్‌వలి, బాలాజీ సింగ్, వివిధ బ్రాంచ్‌ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.