అనంతపురం

వివాదాస్పదమైన ‘దుర్గం’ సర్కిల్ ఎక్సైజ్ సిఐ బదిలీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 17 : పెనుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని కళ్యాణదుర్గం ఎక్సైజ్ సర్కిల్‌లో పని చేస్తున్న మహిళా సిఐని జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి మార్చడం వివాదాస్పదమైంది. ఓ ప్రజాప్రతినిధి కుమారుడు రాజకీయ పలుకుబడి ఉపయోగించి కమిషనర్ ద్వారా ఆమెను తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 9 నెలల క్రితం కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐగా కె.అన్నపూర్ణను తప్పించి బార్డర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పని చేస్తున్న సృజన్‌బాబును నియమించారు. ఆమెను సర్కిల్ నుంచి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అటాచ్ చేస్తూ సంబంధిత శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే కళ్యాణదుర్గం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బెళుగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాలు ఉన్నాయి. వీటిన్నింటిలోనూ మొత్తం 9 వైన్ షాపులున్నాయి. సిఐగా బాధ్యతలు చేపట్టిన అన్నపూర్ణను వైన్‌షాపుల నుంచి అనధికారికంగా డబ్బు వసూలు చేసి తమకూ వాటా ఇవ్వాలని, అలాగే బెల్ట్ షాపులను పట్టించుకోవద్దని ఓ ప్రజాప్రతినిధి కుమారుడితోపాటు అధికార పార్టీ నేత కలిసి వసూలయ్యే సొమ్ములో తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు ఆమె వినకపోవడంతో తమ రాజకీయ పలుకుడి ఉపయోగించి ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదు పంపినట్లు తెలిసింది. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు పెనుకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గత రెండు నెలల క్రితం విచారణ చేపట్టి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అటాచ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వులు సైతం అన్నపూర్ణకు ఇవ్వలేదని, స్వయంగా ఆ స్థానంలో నియమితులైన సిఐ సృజన్‌బాబు ఉత్తర్వులు తీసుకెళ్లి బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయంపై వైకాపా నాయకుడు రాగే పరశురామ్ తదితరులు డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సంబంధిత ప్రజాప్రతినిధిని వివరణ కోరుగా తాను వైన్‌షాపుల నుంచి మామూళ్లు వసూలు చేసి వాటా ఇవ్వాలని చెప్పలేదని, అసలు బెల్ట్‌షాపుల విషయంపైనే ఏమీ మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. సిఐ అన్నపూర్ణ ఉద్దేశ పూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తోందని అన్నారు. పెనుకొండ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ ప్రణవి వివరణ ఇస్తూ తమ విచారణలో టిడిపి ఒత్తిడి ఉన్నట్లు తేలలేదని, విధుల నిర్వహణలో సిఐ అన్నపూర్ణ విఫలమైందని వివరించారు. అంతేగాకుండా వ్యక్తిగత కారణాలే సిఐ స్థానం నుంచి తప్పించడానికి కారణమని, అధికారుల సేవల్ని ఎక్కడైనా వినియోగించుకునే వీలుందని ఈఎస్ అన్నారు. డిప్యూటీ కమిషనర్‌ను మాట్లాడుతూ సిఐ అన్నపూర్ణపై కమిషనర్‌కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు విచారణ చేపట్టామే తప్ప రాజకీయ కారణాలు ఏమీ లేవని వివరించారు. ఏదిఏమైనా ఎక్సైజ్ సిఐ అన్నపూర్ణ బదిలీ రాజకీయ వివాదం తలెత్తిందని చెప్పవచ్చు.