అనంతపురం

వేరుశెనగ పంట అంచనాకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 17 : వరుస కరవులతో ఏటా వేరుశెనగ పంట నష్టపోతున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే వేరుశెనగ పంట విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. దీనిద్వారా రైతులు విత్తిన తేదీలతో సాగు విస్తీర్ణం వివరాలు పొందు పరుస్తారు. అంతేగాకుండా పంట నష్టపోకుండా రెయిన్‌గన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేసేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించనున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా లక్ష ఫారంపాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 55 వేలకుపైగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంపిక చేసిన రెయిన్‌గన్ విధానం అమలుకు ఇప్పటికే ప్రభుత్వం రూ.164 కోట్లు కేటాయిస్తూ జీఓ జారీ చేసింది. ఇందులో అధిక శాతం నిధులు జిల్లాకు వెచ్చించనున్నారు. ఏటా జిల్లావ్యాప్తంగా 7 లక్షల హెక్టార్లకు పైగానే వేరుశెనగ పంట సాగవుతోంది. ఇకపోతే వర్షాధారంగా జిల్లాలో విస్తారంగా వేరుశెనగ సాగు చేస్తారు. అయితే సక్రమంగా వర్షాలు పడకపోవడంతో కనీసం పెట్టుబడులు సైతం రాని పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిస్థితి నుంచి రైతుల్ని రక్షించేందుకు, విత్తు పూర్తయిన తర్వాత కనీసం నెల రోజుల తర్వాత వర్షం రాకున్నా పంటకు కాపాడేందుకు రెయిన్‌గన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా రైతులు, మహిళా సంఘాల సభ్యులతో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కనీసం 150 ఎకరాల విస్తీర్ణంలో రైతుల్ని ఓ గ్రూపుగా తయారు చేసి వేరుశెనగ పంటకు నీటి తడులు ఇవ్వనున్నారు. ఒక్కో గ్రూపునకు 2 రెయిన్ గన్స్ సెట్, 2 ఆయిల్ ఇంజిన్లు, 2 స్ప్రింక్లర్లు, 100 హెచ్‌డిపి పైపులు ఇస్తారు. వీటి సరఫరాకు కంపెనీలను త్వరలోప్రభుత్వం ఖరారు చేయనుంది. ప్రస్తుతం నైరుతీ రుతుపవకాల కారణంగా ఈనెలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 15 తర్వాతే నీటి తడులు వేరుశెనగకు అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం రైతులు దుక్కులు చేసి విత్తుకు భూముల్ని సిద్ధం చేశారు. అక్కడక్కడా విత్తనాలు సైతం వేశారు. రెండుమూడు రోజుల్లో వర్షాలు కురిస్తే జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా వేరుశెనగ విత్తనున్నారు. అనంతరం వరుణుడు కరుణించక పోతే మొలకెత్తినా పంట దెబ్బతినే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో నిర్మిస్తున్న ఫారంపాండ్లలో నిల్వ ఉండే వర్షం నీటితో రెయిన్‌గన్ ద్వారా పంటలను తడుపుతారు. ఇందుకోసం ఎన్ని హెక్టార్లలో వేరుశెనగ పంట వర్షాధారంగా సాగయిందన్న వివరాలు సమగ్రంగా తెలుసుకునేందుకు కలెక్టర్ కోన శశిధర్ చొరవతో సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. విత్తిన తేదీలతో సహా సాగు వివరాలను పకడ్బందీగా సేకరించాల్సిందిగా వ్యవసాయ శాఖను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఏపి ఎంఐపి, డిడబ్ల్యు ఎంఏ శాఖల సమన్వయంతో ఫారంపాండ్లు, రెయిన్ గన్ అమలుపై కలెక్టర్ నిత్యం సమీక్షిస్తున్నారు.