అనంతపురం

అంకితభావంతో విధులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 24: మున్సిపల్ ఉద్యోగులందరూ సమయ పాలన పాటిస్తూ అంకితభావంతో పనిచేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి సూచించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిపాలనా విభాగంలో అకౌంట్స్ విభాగాన్ని పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, మున్సిపల్ సాధారణ ఖాతాలో నిలువ, ఖర్చులు తదితర వివరాల గురించి సీనియర్ అకౌంటెంట్ సునీతతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ సెక్షన్‌లను పర్యవేక్షిస్తున్న జూనియర్ అసిస్టెంట్ల రికార్డులను పరిశీలించారు. సమస్యలపై వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తప్పకుండా సమయ పాలన పాటించాలని, తమతమ సీట్లకు సంబంధించి రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
విడి రోడ్డు విస్తరణ పనులు పరిశీలన
గత రెండు రోజులుగా జరుగుతున్న వాసవీ ధర్మశాల విస్తరణ పనులను చైర్‌పర్సన్ లక్ష్మి, డిఇఇ వన్నూరస్వామి శుక్రవారం పరిశీలించారు. వర్షాకాలంలో వర్షం వస్తే నీరంతా రోడ్లపైకి వచ్చి రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గమనించిన చైర్‌పర్సన్ సంబంధిత రహదారిలో డ్రైనేజీలను ఆక్రమించుకుని ఏర్పాటు చేసుకున్న సిమెంటు కాంక్రీట్‌లను తొలగించి రహదారి విస్తరణకు చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు ఎన్నో ఏళ్లుగా మట్టితో పేరుకుపోయిన డ్రైనేజీను పూర్తి స్థాయిలో శుభ్రం చేయించేందుకు ఆదేశించారు. దీంతో ఆయా పనులు చురుగ్గా సాగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.