అనంతపురం

డిఇఓ కార్యాలయంలో ఛీటర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 24: పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఎఎస్‌ఓ(అసిస్టెంట్ స్టాటిటికల్ ఆఫీసర్)గా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తిష్టవేసి అందినకాడికి దోచుకుంటున్నాడు. పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయుల బలహీనతను అడ్డుపెట్టుకుని జేబులు నింపుకుంటున్నాడు. తాజాగా ఓ టీచర్ నియామకం విషయంలో లంచం డిమాండ్ చేసి ఉన్నతాధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఆలమూరు జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గత పదేళ్లుగా డిఇఓ కార్యాలయంలో ఫారెన్ సర్వీస్ కింద ఎఎస్‌ఓగా పనిచేస్తున్నాడు. జిల్లా విద్యాశాఖాధికారి మొప్పుపొంది బదిలీ కాకుండా నెట్టుకొస్తున్నాడు. ఇలా గత పదేళ్లుగా అక్కడే తిష్టవేశాడు. ఎంతమంది డిఇఓలు మారినా ఆయన మాత్రం కదలకుండా కుర్చీని అంటిపెట్టుకుని ఉండేవాడు. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు ఏవరైనా తన అవసరం నిమిత్తం డిఇఓకు దరఖాస్తు చేసుకుంటే రహస్యంగా అందులోని వివరాలు సేకరించి వారితో ఫోన్‌లో మాట్లాడేవాడు. నీ పని చేయిస్తా నాకు ఏం ఇస్తావని బేరం పెడతాడు. పని కోసం నిత్యం డిఇఓ కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు ఎందుకొచ్చిన తిప్పలురా నాయనా అని అనుకుంటూ అతడు అడిగినంత ముట్టజెబుతున్నారు. ఇలా పెద్దసంఖ్యలో టీచర్లను మోసిం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా డియస్సీ 2014లో సెంకడరీ గ్రేడ్ టీచర్స్ సెలక్షన్‌లో ఒక అభ్యర్థి మెరిట్ సాధించి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. సదరు అభ్యర్థికి సంబంధించి కొన్ని సర్ట్ఫికెట్లు సరిగా లేవని రీ వెరిఫికేషన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషన్ నుండి రెవిన్యూశాఖకు ఆదేశాలు అందాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ అభ్యర్థి సర్ట్ఫికెట్లను మరోసారి పరిశీలించి సరైనవేనని నిర్ధారించుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారిణికి పంపారు. కలెక్టర్ అందించిన సమాచారంతో ఏకీభవించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న ఎఎస్‌ఓ రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగిని సంప్రదించి డియస్సీలో ఉద్యోగం పొందిన అభ్యర్థికి సంబంధించిన ఉత్తర్వులు జిల్లాకు పంపకుండా ఆపాలని సూచించాడు. దీంతో కొంత కాలం ఆ ఉత్తర్వులు అలాగే ఉండిపోయాయి. ఇంతలో ఉద్యోగం పొందిన అభ్యర్థిని సంప్రదించి రూ.మూడు లక్షలు ఇస్తే ఉద్యోగం వచ్చేలా చేస్తానని బేరం పెట్టాడు. పది రోజులు పాటు బేరాన్ని నాచ్చిన అభ్యర్థి ఫోన్‌ను ఎఎస్‌ఓ మాటలను రికార్డు చేసి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఆధారంతో కలిపి చూపించారు. దీన్ని తీవ్రంగా పరిగంచిన కమిషనర్ 10 రోజుల క్రితం టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిఇఓను ఆదేశించింది. అయితే రోజులు గడుస్తున్నా ఎఎస్‌ఓపై ఎలాంటి చర్య తీసుకోలేదు. విషయం తెలుసుకున్న కమిషనర్ 4 రోజుల క్రితం డిఇఓకు ఫోన్ చేసి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో డిఇఓ ఎఎస్‌ఓకు షోకాజ్ నోటీసు బుధవారం ఇచ్చినట్లు విశ్వసనీయసమాచారం. షోకాజ్ నోటీసు అందుకున్న ఎఎస్‌ఓ ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, ఎలాంటి సంబంధం లేనట్లు డిఇఓ కార్యాలయంలో దర్జాగా తిరుగుతున్నాడు. ఎఎస్‌ఓ గత పదేళ్లుగా కార్యాలయంలో పనిచేస్తూ ఉపాధ్యాయుల బదిలీల్లో చక్రం తిప్పినట్లు సమాచారం. తాజాగా కోరుకున్న చోటుకి బదిలీ చేయిస్తానంటూ రూ.50 వేలు వసూలుచేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో డిఇఓ ఆ టీచర్‌ను మందలించినట్లు సమాచారం. ప్రస్తుత విద్యా సంవత్సరం పాఠశాలకు వెళ్లి పాఠాలు చెప్పాలని ఎఎస్‌ఓను ఆదేశిస్తూ డిఇఓ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలుస్తోంది. గతంలో బాలికలకు అందించిన సైకళ్ళ గోల్‌మాల్ వ్యవహారం, ఉపాధ్యాయుల నుండి అధిక మొత్తంలో వసూలు చేసిన వాస్తవాలు లాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి, కానీ ఏ డిఇఓ కూడా ఇతనిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎఎస్‌ఓ వ్యవసారశైలిపై డిఇఓ అంజయ్యను వివరణ కోరగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నుండి ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు. ఏవైనా ఉంటే మీడియాకు తెలుపుతానని దాటవేశారు.