అనంతపురం

హంద్రీనీవా పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 2: జిల్లాను సస్యశ్యామలంగా చేయడానికి హంద్రీనీవా ప్రాజెక్టును పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం స్థానిక రెవిన్యూ భవన్‌లో హంద్రీనీవా పనులు పురోగతి, భూసేకరణ పనులపై హంద్రీనీవా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబందించి ప్యాకేజీల వారిగా జరుగుతున్న పనులు, పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై సమీక్షించారు. స్ట్రక్చర్లు, అండర్ టనె్నల్స్, అక్విడెన్సుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న డిజైన్ల అప్రూవల్‌ను వెంటనే తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిత్యం పర్యటించాలని, పనుల పురోగతిని వేగవతంగా చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుండి ప్రతి వారం కాల్వ గట్టు వెంబడి తాను పర్యటిస్తానని తెలిపారు. పురోగతి లేని కాల్వలకు సంబందించిన కాంట్రాక్టుర్లు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తగినంత మంది వర్కర్లు, మిషన్లు ఉపయోగించాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలిపే ఫొటోలు తీసి తనకు వాట్సప్‌లో ప్రతి రోజు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో హంద్రీనీవా పనులు వేగవంతం చేయాలని, లేనిపక్షంలో అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెసి బి.లక్ష్మికాంతం, జల వనరుల శాఖ సిఈ జలంధర్, హంద్రీనీవా ఈఈలు, డిఈలు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను
ప్రజల్లోకి తీసుకెళ్లండి

* బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి

తలుపుల, జూలై 2: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని రాష్ట్ర బిజెవైఎం అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన మండల బిజెపి కార్యకర్తల సమావేశానికి ఆయనతోపాటు దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, బిజెపి నాయకులు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్రమోదీ 42 సంక్షేమ పథకాలను నూతనంగా అమలుచేశారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 1 లక్ష 50వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరు చేసారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం చెప్పకుండా కేంద్రం సహకరించడం లేదని చెబుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, వాటికి మంజూరు చేసిన నిధుల వివరాలను తెలుపుతూ బిజెపి రాష్ట్ర కమిటీ లఘు చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ లఘు చిత్రాన్ని గ్రామస్థాయి నుండి పట్టణస్థాయి వరకు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంటును అనంతపురం జిల్లా నంబూలపూలకుంటలో కేంద్రం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు అధికంగా వుండడంతో వారిని ఆదుకోవడంలో భాగంగా కేంద్రం పసల్ బీమా యోజనా పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పసల్ బీమా యోజన పథకాన్ని కేంద్రం అమలుచేస్తోందన్నారు. ఇందుకు ప్రధానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకే అందజేయడం జరుగుతోందన్నారు.