అనంతపురం

గ్రానైట్ పరిశ్రమల యజమానులకు సమన్యాయం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జూలై 4: తాడిపత్రి ప్రాంతంలో అంతరించిపోతున్న గ్రా నైట్ పరిశ్రమలకు పునర్జన్మ కల్పిస్తామని, లగాన్ అన్న మాట తాడిపత్రి ప్రాంతంలో లేకుండా చేసి గ్రానైట్ పరిశ్రమల యజమానులకు సమన్యా యం చేస్తానని శాసన సభ్యులు జెసి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాడిపత్రి ప్రాం తంలో గ్రానైట్ గుండ్లను తోలే ఇద్దరి యజమానుల పెత్తనంతో గ్రానైట్ పరిశ్రలు నడుస్తున్నాయని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులకు కళ్లెం వేసి, చట్టపరమైన నిర్ణయాలను అమలుచేసి, గ్రానైట్ పరిశ్రమ యజమానుల ప్రయోజనాలను కాపాడటంతోపాటు ప్రభుత్వానికి సరైన రాబడి అందించాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాడిపత్రి గ్రానైట్ పరిశ్రమ య జమానులకు, గ్రానైట్ గుం డ్లు తోలే లారీ యజమానులకు కొన్ని షరతులు విధిస్తున్నానని, వాటి ని తప్పకుండా పాటించి తీరాల్సిందేనన్నారు. తాడిపత్రి పరిసర ప్రాంతాలకు గ్రానైట్ ఫ్యాక్టరీలకు అవసరమైన గుండ్లను తోలుతున్న లారీ యజమానులు తాడిపత్రి లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, లగాన్ అన్న మాట తాడిపత్రిలో వినిపించరాదన్నారు. క్వారీ నుంచి గుండ్లను తోలే ప్రతి లారీ ప్రతి ట్రిప్పునకు వేబిల్లు, రాయల్టీలతో క్ర మం తప్పకుండా తప్పనిసరిగా యజమాని తోలవలెనని, గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులకు లారీ గుండ్ల బాడుగను తగ్గిస్తానన్నారు. తాడిపత్రి గ్రా నైట్ ఫ్యాక్టరీ యజమానులు, గుండ్లు తోలేవారు ఎవరైనాసరే ఇతర ప్రాంతాలలోని ఏ క్వారీ నుంచి అయినా, తోలుకోవచ్చునని తెలిపా రు. ఇతర ప్రాంతాల్లోని క్వారీ యజమానులతో మాట్లాడి ప్రస్తుతమున్న గుండ్ల ధరలను తగ్గించేందుకు కృషి చేస్తానన్నారు.