అనంతపురం

పంతాలు పట్టింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, జూలై 4: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార పార్టీ నేతల పంతాలు, పట్టింపులతో ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. రెండేళ్ల ప్రగతి చాటున అభివృద్ధి పనులు 3మాయా2జాలంగా మారుతున్నాయి. కార్పొరేషన్‌లో డివై4్ఢర్2 పనులంటే అధికారులు జడుసుకుంటున్నారు. డివైడర్ల ఊసెత్తటానికి విముఖత చూపుతున్నారు. ప్రజలు ఏ చావు చచ్చినా మాకు ఫరవా లేదు, మా పంతాలు నెగ్గితే చాలన్నట్లుగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ప్రజలు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాన రహదారి అందులోను మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట తిరుగాడే పాదచారులు, వాహనదారుల ఇబ్బందులు పాలకులకు కనిపించటం లేదాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రజలను దృష్టిలో ఉంచుకునైనా మధ్యేమార్గంగా ఉపశమన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అయితే ఆ దిశగా పనులు నిర్వహించాలన్నా అధికార పార్టీలోని ఇరు వర్గాల ముఖ్య నేతల వ్యవహారంలో కోరి తలనొప్పులు తెచ్చుకున్నట్లేనని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రజలు అభివృద్ధి పనుల చాటున ఇబ్బందులుపడుతున్నా ప్రేక్షక పాత్ర వహించక తప్పని పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రెండేళ్లలో నగరాభివృద్ధి చేశామని ప్రకటించుకుంటున్న అధికార పార్టీ నేతలకు కళ్లెదుట సమస్యలు కనిపించటం లేదాయని మండిపడుతున్నారు. నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టే ప్రతి పనిలోను నేతల ప్రయోజనాలతో ముడిపడి ఉండటంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీలోని ముఖ్య నేతలిరువురు ఒకరి పొడ మరొకరికి గిట్టకపోవటంతో ప్రతి పని వివాదాస్పదమవుతోంది. దీనికితోడు అవసరమున్నా లేకున్నా లక్షలాది రూపాయల వ్యయంతో ప్రతిపాదించే అభివృద్ధి పనులను ఒక నేత వ్యతిరేకిస్తుంటే అదే సమయంలో మరో నేత సమర్థిస్తుండటం జరుగుతోంది. నేతల స్వప్రయోజనాలు ఎలా ఉన్నా ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. నేతల పంతాల నడుమ జోరుగా అవినీతి, అక్రమాలు సాగుతుండటాన్ని విజిలెన్స్, ఎసిబి శాఖలు నిశితంగా పరిశీలిస్తూ సమయం కోసం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. ఇవేవి నేతలకు పట్టకపోవటంతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు బాహాటంగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లే తమ నేతలు, పాలకవర్గంపై లోలోన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిలదీయాలని యత్నిస్తే తమను టార్గెట్ చేసి డివిజన్లలో అభివృద్ధి పనులు జరగనీయకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట హడావిడిగా తొలగించిన డివైడర్లు ఇందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. డివైడర్లను తొలగించటాన్ని నిరసిస్తూ ఎంపి జె.సి.దివాకరరెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా చేయటానికి సిద్ధమయ్యారు. దీనితో మంత్రి, టిడిపి జిల్లా అధ్యక్షుడు జోక్యం చేసుకుని ఎంపికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎంపి పట్టువీడకపోవటంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీతో ధర్నా విరమించారు. అయితే 15 రోజుల క్రితం డివైడర్లను తొలగించి గుంతలు తీయటంతో రద్దీగా ఉండే సప్తగిరి సర్కిల్‌లో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గుంతలకుతోడు ఇరుకు రోడ్డు కావటంతో వాహనాల రద్దీతో రోడ్డు దాటే పాదచారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు గుంతలలో పడి గాయాలపాలవుతున్నారు. నిలిచిన అభివృద్ధి పనులు చేపట్టే వరకూ కనీసం గుంతలను పూడ్చి వేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పనులు చేపడితే త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుందంటున్నారు. అలాకాకుండా అధికార పార్టీ నేతల పంతాలకు, పట్టింపులకు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారం అటు ప్రజా ప్రతినిధులకుకాని ఇటు కార్పొరేషన్ అధికారులకు కాని లేదంటున్నారు. నేతలు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించటం తగదంటున్నారు. తాము తలచింది జరిగితీరాలన్న నేతల వ్యవహార శైలిని ప్రజా 3నిఘా2 నేత్రం నిరంతరం పరిశీలిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా నేతలు పట్టింపులను వదలిపెట్టి ప్రజల అసౌకర్యాలను గుర్తించి గుంతలు పూడ్చివేసే చర్యలు చేపట్టి ఉపశమనం కలిగించాలని వారు కోరుతున్నారు. లేదంటే కార్పొరేషన్ ఎదుట డివైడర్ల తొలగింపుతో ఏర్పడిన గుంతలు ఇంతే సంగతులు.అనంతపరం మందుల్ని కూడా అవసరమైతే వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించి ఎండిటి ఇస్తామన్నారు.