అనంతపురం

కుష్ఠువ్యాధి నిర్మూలనపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 4:కుష్ఠు వ్యాధిపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ విభాగం అధికారులు కార్యచరణను రూపొందించారు. ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ వ్యాధి తీవ్రత, నివారణ చర్యలు, నివారణ శాతం వంటి అంశాలపై సమీక్షిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు మరిం త కార్యోన్ముఖులయ్యారు. క్షేత్ర స్థా యిలో వ్యాధిగ్రస్తులకు సక్రమంగా మందులు అందించడం, వారి సంక్షే మ పథకాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించడం వేగవంతం చేశారు. దేశ వ్యాప్తంగా కుష్ఠు వ్యాధిని తరిమివేయాలని, భవిష్యత్తులో ఈ వ్యాధి ఆనవాళ్లు కూడా ఉండకూడదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మొదటి గురువారం కుష్ఠువ్యాధి, నివారణ, మందుల వాడకంపై సంబంధిత అధికారులు ఇంటింటి సర్వేతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బహుళ ఔషధ చికిత్స (ఎండిటీ-మల్టీ డ్రగ్ ట్రీట్‌మెంట్)ను జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 296 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గత ఏడాది 337 మంది (కేసులు) వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 41 మంది పూర్తిగా కోలుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యాధి గ్రస్తులకు వ్యాధి తీవ్రతను బట్టి 6 నెలలు, లేదా 12 నెలల పాటు బహుళ ఔషధ చికిత్సను అందిస్తున్నారు. ఈ వ్యాధి వంద శాతం నయమయ్యే రోగమని, వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన అవసరం లేదన్న విషయంపై విస్తృత ప్రచారం కల్పించబోతున్నారు. దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాలో తొలిసారి ఈ నెల మొదటి ఈ నెల 7వ తేదీ గురువారం కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతపురం నగరంలోని ఒకటో వార్డులో 41 మంది అనంతపురం వైద్య కళాశాల విద్యార్థులతో సర్వే చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 300 జనాభాను సర్వే చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కుష్ఠు నివారణ విభాగం రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ వారం రోజుల క్రితం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు సర్వే చేసే విధానాన్ని వివరించారు. కుష్ఠు వ్యాధిని ఎలా గుర్తించాలి? నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సర్వే ఎలా చేయాలి? అన్న పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ అనంతపురం నగరంలో వైద్య విద్యార్థుల బృందం ఇంటింటి సర్వే చేయనుంది.
కుష్ఠు నివారణకు ప్రత్యేక కార్యాచరణ
* డిఎల్‌ఓ డాక్టర్ సాయిప్రతాప్
జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించి అమలు చేస్తున్నామని జిల్లా కుష్ఠువ్యాధి నివారణ అధికారి (డి ఎల్ ఒ) డాక్టర్ టివి.సాయిప్రతాప్ అన్నారు. ఎండిటి కింద రోగులకు రిఫామ్‌సిలిన్, క్లోఫిజమైన్, డాక్సోన్ మందుల్ని పూర్తి ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఏటా ఏప్రిల్ నుంచి మార్చి వరకు గణాంకాలు రూపొందిస్తున్నామన్నారు. వ్యాధి తీవ్రత ఉన్న రోగులకు చిత్తూరు జిల్లా పలమనేరులో శస్త్ర చికిత్సలు(రీకన్‌ష్టక్ట్రివ్ సర్జరీ) చేయిస్తున్నామన్నారు. శస్త్ర చికిత్స అనంతరం వారికి రూ.8వేలు చొప్పున వెంటనే ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. ఎవరైనా తెల్లమచ్చలు ఉండి అనుమానం ఉన్నా, స్పర్శ లేకున్నా వెంటనే సమీపంలో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాఆయన కోరారు.