అనంతపురం

జగన్‌వి పగటి కలలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూలై 19: వైకాపా నాయకుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ సిఎం కావాలనే భ్రమలో పగటి కలలు కంటున్నాడని, అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని మంత్రి డా.పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం నగరంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా చేపట్టిన గడప గడపకు కార్యక్రమాన్ని బహిష్కరించాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన జగన్ ఏ ఉద్దేశ్యంతో గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని చేపట్టాడో ముందుగా ప్రజలకు తెలపాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలకు రూ. 24 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసినందుకా, రాజధాని నిర్మాణం వద్దని చెప్పేందుకా, పట్టిసీమతో రాయలసీమకు నీరు వద్దని చెప్పేందుకా అని జగన్‌ను మంత్రి పల్లె ప్రశ్నించారు. వైకాపా అధినేత తీరునచ్చక ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను తిరస్కరించారని, ఎమ్మెల్యేలు కూడా తిరస్కరించే సమయం ఆసన్నమైందన్నారు. రానున్న రోజుల్లో జగన్‌కు పుట్టగతులుండవని అన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వ లేక ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి జగన్ పూనుకున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలన్నారు.