అనంతపురం

సారుూ భగవాన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూలై 19: నగరంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా మంగళవారం షిర్డీ సాయిబాబా మందిరాలకు భక్తులు బారులుతీరి సద్గురు సాయినాథ్‌ను దర్శించుకున్నారు. ఆలయాల్లో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, సాయి సత్య వ్రతములు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆషాడ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా, గురుపౌర్ణమి జరుపుకోవడం భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇందులో భాగంగా వివిధ ఆధ్యాత్మిక సంస్థలు, సంప్రదాయాలకు చెందినవారు తమతమ గురువులను పూజిస్తారు. నగరంలోని శైవ, వైష్ణవాలయాలతోపాటు షిర్డిసాయి మందిరాలు, వివిధసంస్థల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలను సంప్రదాయబద్దంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మొదటి రోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయం, పాతవూరు దత్తాత్రేయ ఆలయం, రైల్వే ఫీడర్ రోడ్డు శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, హాస్పిటల్ రోడ్డులో గల దత్త మందిరం, శారదానగర్ శృంగేరి శంకరమఠం, శివకోటి ఆలయాల్లో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. షిర్డిసాయి మందిరాల్లో గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. చెరువుకట్టపై వెలసిన షిర్డీ సాయినాథ్ మందిరం, వేమన టెలిఫోన్ భవన్ ఎదురుగా గల సాయిబాబా దేవాలయం, వేణుగోపాల్ నగర్‌లో షిర్డీ సాయిబాబా ఆలయం, మూడో రోడ్డు సాయిబాబా ఆలయం, అరవింద నగర్, రామచంద్ర నగర్, హౌసింగ్ బోర్డు సమర్థ సద్గురు సాయి సేవాశ్రమం, పాతవూరు కోదండ రామాలయం, అరవిందనగర్, సాయిగీతామందిర్, రాంనగర్, మారుతినగర్, ఐదో రోడ్డు, తపోవనం, హెచ్చెల్సీ కాలనీల్లో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. షిర్డిసాయికి పల్లకీ సేవ నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు సద్గురు సాయిని దర్శించుకున్నారు. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, సత్యసాయి భజన మండలి, భగవాన్ రమణ మహర్షి సేవా సమితి, చిన్మయ మిషన్, విపశ్యన ధ్యాన కేంద్రం, సద్గురు రాజ్యలక్ష్మమ్మ ఆశ్రమం, ఆర్యవైశ్య సంఘం, వలీస్వామి ఆశ్రమం తదితర సంస్థల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో గురువు విశిష్టత, గురుపౌర్ణమి విశిష్టతలను గూర్చి వివరించారు. శ్రీ వివేకానంద యోగ కేంద్రం ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జడ్పీ హాలులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, మేయర్, అడిషనల్ ఎస్పీ, జడ్పీ సిఇఓ తదితరులు హాజరై యోగా గురువులను సత్కరించారు. యోగా టీచర్లకు సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు.
పామిడిలో....
పామిడి : పట్టణంలో మంగళవారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక సాయిబాబా, శ్రీ గురుదత్త, వీరబ్రహ్మేంద్ర, అంబా భవాని దేవాలయాల్లో స్వాములవారిని ప్రత్యేకంగా అలంకరించిన అర్చకులు పూజలను నిర్వహిస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రజలకు అన్నదానం చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బుక్కరాయసముద్రంలో...
బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చిక్కప్పవడియార్ చెరువు కట్టపై వెలసిన శ్రీ అనంత షిర్డీ సాయినాథుని ఆలయంలో మంగళవారం తెల్లవారుజాము నుండి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కాగడ హారతి, నిత్యపూజ, అభిషేకంతోపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బుక్కరాయసముద్రం ఎస్సై విశ్వనాథ్‌చౌదరి తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించి సాయంత్రం శ్రీ షిర్డీ సాయినాథుని రథం ఉరేగింపు నిర్వహించారు.