అనంతపురం

నిందితుల కోసం గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 22 : నగరం లో గురువారం జరిగిన జంటహత్య కేసు నిందితుల కోసం ముమ్మర గాలి ంపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. చంద్రబాబు కొట్టాలకు చెందిన గోపీనాయక్, వెంకటేష్ నాయక్‌ను ప్రత్యర్థులు దారుణం గా నరికి చంపిన విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ వివరాలు వెల్లడించారు. హత్యలు జరిగిన తక్షణం నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బృందాలు వివిధ చోట్ల గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అలాగే వివిధ కోణాల్లో కేసు విచారణ చేపట్టామన్నారు. బొలేరో వాహనం ఎవరిది? బైకు ఎక్కడిది? నిందితులు ఎంతమంది ఉన్నారు? పతకం ఎలా వేసుకున్నారు? ఎక్కడి నుంచి వెంబడించారు? అనే అంశాలతోపాటు నిందితులకు ఎవరైనా సహకరించారా? అనే దిశగా విచారణ చేస్తున్నాన్నట్లు తెలిపారు. వెంకటేష్‌నాయక్, గోపీనాయక్, అక్కులప్ప, అమర్ తదితరులు స్నేహితులని, వీరంతా కలిసి నేరాలకు పాల్పడుతుండేవారన్నారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు రావడంతో ఆధిపత్య పోరులో భాగంగానే హత్యలు చోటుచేసుకున్నాయని పునరుద్ఘాటించారు. ప్లాట్ల వ్యాపారం, ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఏడాది క్రితమే గోపీనాయక్, గోపాల్‌నాయక్‌కు ప్రత్యర్థులు హతమార్చాలని పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారన్నారు. అంతేకాకుండా ఇటీవల రెండు వర్గాలను కూడా బైండోవర్ చేసి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఇకపోతే నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో రుద్రంపేటలో ఘటన జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా రాజకీయ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. జంటహత్యల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన నగర వాసుల్లో నెలకొంది. ఇక రుద్రంపేట, చంద్రబాబు కొట్టాలలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.