అనంతపురం

తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జూలై 22:తాడిపత్రిలో ప్రజస్వామ్యం ఖూనీ అయ్యిందని, నాటి నియంతల పాలన, ఎమర్జెన్సి పాలన తాడిపత్రిలో ఈనాడు నడుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం పెన్నానది కొత్తవంతెన వద్ద ఉన్న చెక్‌పోస్ట్‌వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈసందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రసంగిస్తూ తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, జెసి దివాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న 30 సంవత్సరాలు తాడిపత్రిలో ఏనాడు చెక్‌పోస్టులులేవని, జెసి ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక చెక్‌పోస్టులు వచ్చాయన్నారు. లగాన్ పేరిట కొందరు అక్రమంగా వ్యాపారంచేస్తుంటే, ఎమ్మెల్యే ఏంచేస్తున్నారో అర్థంకాలేదన్నారు. ఈసమస్యను పరిష్కరించాల్సిన భాద్యత ఎమ్మెల్యేదే అన్నారు. అధికారపార్టీ కార్మికుల సమస్యను పరిష్కకుండా మొద్దునిద్దరపోయి పట్టించుకోకపోతే, దున్నపోతులాంటి ప్రభుత్వాన్ని నిద్దురలేపుతామని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఎర్రజెండ గళంవిప్పుతుందన్నారు. సమస్యలపై సిపిఐ ధర్నా చేపడుతుందని డిఎస్పీ, సిఐలకు పర్మిషన్ అడిగితే తాడిపత్రిలో ఎమర్జెన్సి ఉన్నట్లు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదని, ఎస్పీతో పర్మిషన్ తీసుకుని ధర్నా చేపడుతున్నామన్నారు. దీనికి ఎమ్మెల్యే ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థంకాలేదాన్నరు. సమస్యపై చర్చలు జరుపకుండా సిపిఐ నాయకులు పైలా నరసింహయ్య, రంగయ్యలపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చుకోవడమేనన్నారు. అన్యాయాలను నిలదీసేహక్కు కమ్యూనిస్టులకుందన్నారు. చెక్‌పోస్టులు పెట్టడంతో కార్మికులు అర్దాకలితో అలమడిస్తున్నారని వెంటనే పరిష్కారమార్గంచూపి చెక్‌పోస్టులను ఎత్తివేయాలని లేకుంటే ప్రతిపక్షపార్టీలన్నింటితో కలసి ఆగష్టు1 తాడిపత్రి బంద్ చేపడుతామని హెచ్చరించారు. నియోజకవర్గ కార్యదర్శి పైలా నరసింహయ్య మాట్లాడుతూ అక్రమంగా ఆస్తులను ఎవరు సంపాదించారో తాడిపత్రి ప్రజలందరికి తెలుసునన్నారు. 89లో మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా ఎవరు పలాయనంచేశారో గుర్తుకుతెచ్చుకోవాలని, బెదిరింపులకు తాము భయపడేదిలేదన్నారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలను ఎలాకాపాడుకోవాలన్నది తమకు తెలుసునని, చెక్‌పోస్టులను తొలగించేందుకు రాష్టస్థ్రాయిలో పోరాటం చేస్తామని తెలిపారు. సిపిఐ జిల్లా సహయకార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ తాడిపత్రిలో ప్రజాస్వామ్యం అపహస్యం పాలైందని, నియంత పాలన కొనాసాగుతోందన్నారు. గతంలో మాదిరిగానే స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని కొనసాగుతున్న విధానానే్న ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి జరుగుతున్న ఆన్యాయలపై జిల్లామంత్రులు పల్లె రఘనాథరెడ్డి, పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్తామని, కార్మికుల వలసలను అరికట్టాలని కోరుతామన్నారు. అనంతరం చెక్‌పోస్టును ముట్టడించడానికి యత్నించగా సిఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి, పోలీసులు సిపిఐ నాయకులను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.