అనంతపురం

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, ఆగస్టు 4 : మండల పరిధిలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి(45) గురువారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్‌రెడ్డి తనకున్న అర్ధ ఎకరా పొలంతోపాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. కౌలుకు తీసుకుని పొలంలో మూడు చోట్ల బోర్లు వేశాడు. అయితే నీళ్లు పడలేదు. అంతేగాకుండా తన అర్ధెకరా పొలంలో మిర్చి పంట సైతం దిగుబడి రాకపోవడంతో మూడేళ్లుగా అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడంతో గురువారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన భాస్కర్‌రెడ్డిని గమణించిన బంధువులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.