అనంతపురం

పకడ్బందీగా సిఎం పర్యటన ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, ఆగస్టు 4: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా 6వ తేదీ బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరగనున్న సభా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. గురువారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాక కోసం అనంతపురం-తాడిపత్రి రహదారి సమీపంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ స్థలం, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బుక్కరాయసముద్రం పంచాయతీ కార్యాలయాన్ని, అనంతరం గాంధీనగర్ సమీపంలో ఉన్న కస్తూరిబాగాంధీ పాఠశాల సమీపంలో ఏర్పాటుచేస్తున్న సభా స్థలంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతం, జిల్లా జాయింట్ సంయుక్త కలెక్టర్ ఖాజా మొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్‌లు సభా స్థలం వద్ద ఏర్పాటుచేస్తున్న స్టాళ్లను, సభా వేదిక, రహదార్లను పరిశీలించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లుకు సూచించారు. రైతులతో సమీక్ష కోసం ఏర్పాటుచేస్తున్న సభా స్థలం కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శమంతకమణి, అనంతపురం డిఎస్పీ మల్లికార్జునవర్మ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గంగయ్య, ఇంటిలిజెన్స్ డిఎస్పీ, అనంతపురం ఆర్డీఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు, జిల్లా టిడిపి నాయకులు అశోక్, జిల్లా తెలుగు యువత నాయకుడు పవన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సభా స్థలం ఏర్పాట్ల వద్ద బుక్కరాయసముద్రం మండలం టిడిపి నాయకులు కుళ్ళాయిరెడ్డి, జొన్నా రామయ్య, మల్లికార్జునరెడ్డి, ఆదిశేషయ్య, కేశన్న, గోవిందురెడ్డి, బాబయ్య, మండల కన్వీనర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.