అనంతపురం

‘చదువు’ చూపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 4 : విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా జిల్లాలో అనేక మంది విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు మీడియం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా సుమారు ఐదారువేల మందికి అందనట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, మున్సిపల్, జడ్పీ మేనేజ్‌మెంట్లతోపాటు ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెట్, ఇతర మేనేజ్‌మెంట్లలో 5,024 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5,80,413 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 24,90,515 పాఠ్య పుస్తకాలు అవసరమని తొలుత ఆన్‌లైన్ ద్వారా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే జిల్లా విద్యా శాఖాధికారులు రాష్ట్ర అధికారులకు ఇండెంట్ పంపారు. తర్వాత అంత మోతాదులో అవసరం లేదని నిర్ణయించి 21 లక్షలకు కుదించారు. అయితే ఇప్పటి వరకూ సరఫరా అయిన వాటిలో మూడు విడతలుగా 20,16,174 పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. మరో లక్ష పాఠ్య పుస్తకాల కోసం నెల క్రితమే ఇండెంట్ పంపారు. కాగా డైస్ విధానం మేరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారు. అందులో చేరిన వారికి సైతం ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెసిడెన్షియల్, కెజిబివి, మోడల్ స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఒక్కో టైటిల్‌కు 4వేల పాఠ్య పుస్తకాలు వచ్చాయని, మరో మూడు రోజుల్లో వీటిని ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నాల్గవ విడతగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. సకాలంలో రాష్టస్థ్రాయిలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి సరఫరా చేయడంలో జాప్యం చోటుచేసుకోవడంతో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతోపాటు తెలుగు మీడియం విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. దీనిపై డిఇఓ అంజయ్య, ప్రభుత్వ పాఠశాలల పాఠ్య పుస్తకాల విభాగం అధికారులు వివరణ ఇస్తూ.. దశలవారీగా వచ్చిన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేస్తున్నామన్నారు. త్వరలో అన్ని పాఠశాలలకు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.