ప్రకాశం

ఏడుగురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 18: ఏడుగురికి జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయంలో కారుణ్యనియామక పత్రాలను అందచేశారు. కార్తీక్, ఎ సుజాత,డి శ్యాంయేలు, వెంకటపద్మ, ఎస్‌కె షంషీర్‌బేగం అనే వారిని అటెండర్లుగా నియమించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా స్వీపర్‌గా డి శివకుమారి, జూనియర్ అసిస్టెంట్‌గా వలీబాషాలను నియమించి వారికి కారుణ్యనియామక పత్రాలను అందచేసినట్లు జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర తెలిపారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరో 22మందికి పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సిఇఒ బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదిని మోసగించిన వ్యక్తి అరెస్టు
పొదిలి, డిసెంబర్ 18 : ఒక న్యాయవాదిని పొలం పేరుతో మోసగించిన కేసులో ఒక వ్యక్తిని పొదిలి పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన గట్లా వెంకట నారాయణరెడ్డి అనే న్యాయవాది హైదరాబాద్‌కు చెందిన కనె్నగండి విజయలక్ష్మీకి చెందిన పొదిలి మండలం పాములపాడు గ్రామంలో ఉన్న 43 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసేందుకు కొందరు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు చేశారు. ఈ నేపధ్యంలో ఆయన భూయజమాని విజయలక్ష్మీ, ఆమె కుమారుడు వేణు గోపాల్‌రావుకు 23 లక్షల రూపాయలు చెల్లించి అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు. అయితే సదరు న్యాయవాదికి తెలియకుండా అదే పొలాన్ని విజయలక్ష్మీ గుంటూరుకు చెందిన ఎం శంకర్‌రెడ్డితో పాటు రామికోటిరెడ్డి, శివ నాగేశ్వరి తదితరులకు రహస్యంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు నారాయణరెడ్డి పొదిలి పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ కేసులో నిందితుడైన వేణుగోపాలరావును పాములపాడు పొలాల్లో అరెస్టు చేశారు. నిందితుడ్ని శుక్రవారం కోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ శశికుమార్ తెలిపారు. కాగా ఈ కేసులో కనె్నగంటి విజయలక్ష్మీతో పాటు మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని, వారు పరారీలో ఉన్నందున గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ శశికుమార్ తెలిపారు.

ప్రాణం తీసిన ఈత సరదా
పామూరు, డిసెంబర్ 18 : స్నేహితుని ఈత సరదా అతడి ప్రాణాలను తీసింది. కళ్ల ఎదుటే నీళ్లలో ఈతకు దిగి మృత్యువాత పడటంతో స్నేహితుడు చలించిపోయాడు. ఎస్‌ఐ సాంబశివయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొదిలి మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం, జుబీర్ అనే ఇద్దరు స్నేహితులు పామూరులోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో ఉన్న బంగారాన్ని విడిపించుకుని వద్దామని బైక్‌పై పామూరు వచ్చారు. ఆ బంగారాన్ని విడిపించుకుని తిరిగి పొదిలి గ్రామానికి వెళుతూ మోట్రావులపాడు వద్ద ఉన్న మనే్నరు వాగులో ఈత కొట్టాలని సరదా పడ్డారు. వాగులోకి వెళ్లి స్నేహితుల్లో ఒకరు గట్టుపై ఉండగా, ఇబ్రహీం వాగులోకి దిగాడు. ఈతరాని ఇబ్రహీం మునిగిపోతూ రక్షించమని కేకలు వేస్తుండగా జుబీర్ నీళ్లలోకి దిగి రక్షించే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. భయాందోళనకు గురైన జుబీర్ 108కి సమాచారం అందించాడు. ఎస్‌ఐ సాంబశివయ్య, గ్రామస్థుల సహకారంతో గాలించినా ఆచూకీ కానరాలేదు. కనిగిరి ఫైర్ స్టేషన్‌కు సమాచానం తెలపగా, ఫైర్ సిబ్బంది లోపలికి దిగి మృతదేహాన్ని పైకి తీసుకొచ్చారు. కుమారుడు అకాల మరణం చెందడంతో మృతుని తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతునికి భార్య, 7నెలల కుమార్తె ఉన్నారు. విఆర్‌ఓ హరిప్రసాద్‌బెనర్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నేరాలపై ఎస్పీ సమీక్ష
ఒంగోలు, డిసెంబర్ 18: ప్రతి నెలా జరిగే నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్ శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఎస్‌పి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ నియంత్రణ గురించి, ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సిబ్బందితో చర్చించారు. రక్షక్ వాహనాలు సరిగా తిరుగుతూ కాలేజీల వద్ద, రద్దీ సెంటర్లలో ఈవ్‌టీజింగ్, చిల్లర నేరాలు జరగకుండా చూడాలని డిఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేశారు. కాల్‌మనీ కేసులలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలాంటి కేసులు జరగకుండా పట్టణాలలో లాడ్జీలను తనిఖీలు చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. దొంగతనాల కేసులు, ఎస్‌సి, ఎస్టీ కేసులు త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఎఆర్‌ఎస్‌పి జె కృష్ణయ్య, ఒంగోలు పట్టణ డిఎస్‌పి జి శ్రీనివాసరావు, మార్కాపురం డిఎస్‌పి శ్రీహరిబాబు, కందుకూరు డిఎస్‌పి వి శ్రీనివాసరావు, చీరాల డిఎస్‌పి జయరామరాజు, ఎస్‌బి డిఎస్‌పి ఆర్ శ్రీనివాసరావు, డిసిఆర్ డిఎస్‌పి మరియదాసు, ఎస్‌సి , ఎస్‌టి డి ఎస్‌పిలు కెవి రత్నం, బాలసుందరరావు, ట్రాఫిక్ డిఎస్‌పి జె రాంబాబు, మహిళా పోలీస్‌స్టేషన్ డిఎస్‌పి బి లక్ష్మీనారాయణ, సిసిఎస్ పోలీస్‌స్టేషన్ డిఎస్‌పి కె వెంకటేశ్వరరావు, డిటిసి డిఎస్‌పి వై శ్రీనివాసరెడ్డి, న్యాయసలహాదారు టి పురుషోత్తమరావు, సిఐలు, ఆర్‌ఐలు, చీరాల ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.