అనంతపురం

తాడిపత్రి ఘటనలో పోలీసులను బలిపశువులను చేయడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 22: తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలకు పూర్తిగా బాధ్యత జేసీ దివాకర్‌రెడ్డి, ప్రబోధానందలదేనని, పోలీసులను బలిపశువులను చేయడం తగదని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు జి.నాగరాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్‌పీఎస్ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జిల్లాలోని తాడిపత్రిలో ఒక రాజకీయ, ఆధ్యాత్మిక గురువు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో పోలీసులను లాగడం సమంజసం కాదన్నారు. పోలీసులు రక్షణ కల్పించడంలో ఎంతో పురోగతి సాధిస్తున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక గురువు రాజకీయ ప్రవేశం కోసం తన సామాజిక వర్గాన్ని ఒక తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జేసీ సోదరులు తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించి ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నవి అని ఆరోపించడం వలన అక్కడ ఒకరి మధ్య ఒకరికి అభిప్రాయ భేదాలు ఏర్పడి ఆ ప్రాంతంలో ఇద్దరూ శాంతి భద్రతకు విఘూతం కల్గిస్తున్నారని ఆరోపించారు. వీరిద్దరూ అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ పోలీసులను బలిపశువులుగా చేస్తూ ఒక దళిత డీఎస్పీని, పోలీసులు అధికారుల సంఘం నేత, బలహీన వర్గాలకు చెందిన సీఐ గోరంట్ల మాధవ్‌ని టార్గెట్ చేయడం చాలా దారుణమని, దీన్ని సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

బోగస్ చేనేత సొసైటీలను రద్దు చేయాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 22: జిల్లాలోని బోగస్ చేనేత సొసైటీలను తక్షణమే రద్దు చేసి, వారి ఆస్తులను జప్తు చేయాలని చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ ఛైర్మెన్ నేసే కోదండరాములు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం డీఆర్‌ఓ సుబ్బారెడ్డిని కలిసి చేనేత సంఘం నాయకులు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా కోదండరాములు మాట్లాడుతూ నేసిన చీరకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీర్చలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న చేనేతలను ఆదుకోవాలని కోరారు. జిల్లాలో బోగస్ సొసైటీలతో లక్షల రూపాయలు దోచుకుంటున్న వారిపై విచారణ జరిపించి, వారి ఆస్తులను జప్తు చేయాలని కోరారు.

భూకంపాల తాకిడిని తట్టుకునే విధంగా భవనాలను నిర్మించాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 22: భూకంపాల తాకిడిని తట్టుకునే విధంగా భవనాలను నిర్మించాలని విశే్వశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా.ఎన్.వెంకటరమణ ప్రసుత్త ఇంజనీర్లుకు పిలుపునిచ్చారు. శనివారం జేఎన్‌టీయూలో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్సు ఇండియా అనంతపురం ఆధ్వర్యంలో ఎర్త్‌క్వేక్ రెసిస్టన్స్ డిజైన్ ఆఫ్ రీ యిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ భూకంప తాకిడి రహిత భవనాలు నిర్మించుటలో భవన నిర్మాణ డిజైన్ స్థాయిలనే తీసుకొనే జాగ్రత్తల వలనే సాధ్యమవుతుందని తెలిపారు. భూకంపాలు భూమిలో జరిగే రసాయిన భౌతిక మార్పుల వల్ల వస్తాయని, భవనాలను వాటి తాకిడికి తట్టుకొనే విధంగా నిర్మించాలని ఇంజనీర్లుకు సూచించారు.

అంగన్‌వాడీల్లో వౌలిక వసతులు త్వరితగతిన పూర్తి చేయాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 22: అంగన్‌వాడీల్లో వౌలిక వసతులు త్వరితగతిన పూర్తిచేయాలని జేసీ-2 సుబ్బరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి కదిరి అంగన్‌వాడీల్లో వౌలిక వసతులు ఏర్పాటుపై జేసీ-2 సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల్లో తాగునీరు, టాయ్‌లెట్లు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుత్ సరఫరా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కదిరి ఈస్ట్ పరిధిలోని గాండ్లపెంట, నల్లచెరువు, తలుపుల, తనకల్లు, ఎన్‌పి కుంట మండలాల్లో తాగునీటికి సంబందించి 93కుగాను 69, టాయిలెట్లు 84కుగాను 16, విద్యుత్ 99కిగాను 87 పూర్తి అయ్యాయని, మిగిలినవి త్వరతిగతిన పురోగతి సాధించాలని సూచించారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.