అనంతపురం

ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, నవంబర్ 19: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా వున్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని బదిరుల జిల్లా అసోసియేషన్ ఛైర్మెన్ సిద్దార్థ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని పాతవూరు నుండి బదిరుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు బదిరులు రాతపూర్వకంగా ఒక లేఖను విడుదల చేశారు. ఇందులో జిల్లాలోని బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అన్ని శాఖల్లో ఖాళీలను సీనియార్టీ బదిరుల ద్వారా భర్తీ చేయాలని, వినికిడి లోపం ఉన్న వారికి వంద శాతం వికలాంగత్వం సర్ట్ఫికెట్లు ఇవ్వాలని, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో నియమించే ఉద్యోగాలకు అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మీకోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో బదిరుల సంఘం నాయకులు సిద్దార్థ, రవికిరణ్, రాఘవేంద్ర, సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడండి
అనంతపురం సిటీ, నవంబర్ 19: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా నవ్యాంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీకి వ్యతికరేంగా పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో సీపీఐ నగర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రకు జీవనాడివంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు నిధులు ఇవ్వకుండా వేధిస్తుండడం సహించరాని విషయమన్నారు.
డప్పు కళాకారులకు
పెన్షన్ మంజూరు చేయాలి
అనంతపురం, నవంబర్ 19: జిల్లాలోని అర్హులైన డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని, అందరికీ పెన్షన్ ఇవ్వాలని డప్పు కళాకారుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు డీపీఆర్వో కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి డప్పు శబ్దంతో, ఆటపాటలతో సమాజాన్ని కదిలించిన వేలాది మంది డప్పు కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారన్నారు. జీవో నెం.199 ప్రకారం పెన్షన్ అర్హత వయస్సును 50 సం.ల నుండి 45కు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెన్షన్‌ను రూ.1500 నుండి 3000లకు పెంచాలన్నారు. ఆర్టీసీ, రైల్వే చార్జీల్లో రాయితీ కల్పించాలన్నారు. అనంతరం జిల్లా పౌర సంబంధ శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు.