అనంతపురం

అపర సంజీవిని సత్యసాయి వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 21 : వైద్యం ఖరీదైన తరుణం పేదవాడికి ప్రాణ సంకటం ఆపన్నహస్తం అందించేందుకు దేవుని రూపంలో భగవాన్ సత్యసాయి తన సేవా నిరతిని చాటారు. 1991 నవంబర్ 22వ తేదీన పుట్టపర్తి సమీపాన ప్రశాంతి గ్రామం వద్ద అత్యాధునిక వసతులతో కూడిన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆరంభించారు. ఇప్పటి వరకు 14 లక్షల మందికి పైగా పేదల ప్రాణాలను కాపాడిన వైద్యాలయంగా పేరెన్నికగనింది. అపర సంజీవినిలా ఈ ఆసుపత్రి నిరంతరం వేలాదిమందికి వైద్యం అందిస్తోంది. లక్షలు విలువలు చేసే అతి ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తోంది. హృద్రోగం, కంటి వైద్యం, ఎముకల శస్త్ర చికిత్సలు, గ్యాస్ట్రో యంత్రాలజీ, యూరాలజీవంటి అతి ఖరీదైన వైద్యంను ఉచితంగా అందిస్తోంది. వంద శాతం విజయవంతమైన శస్త్ర చికిత్సలు వైద్యం అందిస్తున్న ఏకైక వైద్యాలయంగా పేరెన్నికగనింది. గ్రామీణ నిరుపేదలకు అపర సంజీవునిలా నిరంతర సేవలను కొనసాగిస్తూ సుమారు 500 పడకలు సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భగవాన్ సత్యసాయి బాబా పేదలకు ప్రసాదించడం ఆయన అవతార విశిష్టతకు మరింత పేరును సముపార్జించింది. పుట్టపర్తి, బెంగళూరు, రాయపూర్, ముంబై తదితర ప్రాంతాలలో సత్యసాయి సూపర్ స్పెషాలిటీలు వేల కోట్లు రూపాయలు వెచ్చించి భగవాన్ బాబా, ఆయన భక్త బృందం నెలకొల్పారు. ప్రాణదానం చేస్తున్న ఈ ఆసుపత్రులు సత్యసాయి సేవా నిరతికే మకుటాయమానంగా నిలుస్తున్నాయి. పుట్టపర్తి, బెంగళూరులలోని సత్యసాయి జనరల్ ఆసుపత్రులు పేద, సామాన్య జనానికి పురుడుపోసే పుట్టినిల్లులా వేలాదిమందికి పురుడు పోసి జన్మలను ప్రసాదిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు సుమారు 200 దేశాలలో సత్యసాయి ఉచిత వైద్య శిబిరాల పేరిట నిరంతరం వైద్య సేవలను అందించడం జరుగుతోంది. అటువంటి మహనీయుడు, అవతార పురుషుడు భగవాన్ సత్యసాయి బాబా స్థాపించిన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 27వ వసంతోత్సవాన్ని నేడు జరుపుకోనుంది. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ గురుమూర్తి, డాక్టర్ నీలందేశాయ్, డాక్టర్ రాఘవరెడ్డి, డాక్టర్ రాంనాథ్‌అయ్యర్‌ల ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని జరుపుకోనున్నారు.

సీఎం వస్తేనే మోక్షమా!
* ఆగమేఘాలపై పనులు..
* రూ.లక్షలు వ్యయం
అనంతపురం, నవంబర్ 21 : సాధారణ రోజుల్లో అనేక రకాల సమస్యలతో నానా అవస్థలు పడుతున్నా, పరిష్కరించమని వేలసార్లు వేడుకున్నా.. ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టించుకోని అధికార గణం, ప్రజాప్రతినిధులు.. ‘రాజొస్తున్నాడు.. పారాహుషార్..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో మేల్కొన్నారు. అత్యవసర పనుల పేరుతో యుద్ధ ప్రాతిపదికన రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈనెల 23వ తేదీ రాత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో బస చేసి, 24న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో నగరంలో సీఎం పర్యటించే మార్గాల్లో ఆగమేఘాలపై చెత్తాచెదారం, మట్టిని ఊడ్చేస్తున్నారు. గుంతలు కనిపించకుండా రోడ్లకు మరమ్మతులు చేసేస్తున్నారు. గ్రీన్ ఆంధ్ర, గ్రీన్ అనంతను తలపించేలా ఇరువైపులా గుంతలు తవ్వి, మొక్కలు నాటి, ట్రీ గార్డులు ఏర్పాటు చేసి పచ్చదనానికి పెద్ద పేట వేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్నయితే పచ్చగా కళకళలాడేలా రూ.20 లక్షల పైబడి వ్యయంతో దాదాపు 15 రకాల మొక్కలు, లాన్‌తో అవరణను సిద్ధం చేస్తున్నారు. రాజమండ్రి సమీపంలోని కడియం నుంచి తెప్పించిన ఫోక్స్‌టైల్ పామ్, ప్లమేరియా పుడికాస్, అరెకే పామ్స్, అవెన్యూ (కానుగ, వేప తదితర మొక్కలు), మోర్నింగ్ ఫ్లవర్స్ వంటి వాటితో సుందరీకరిస్తున్నారు. గతంలో సీఎం ఈ అతిథి భవనానికి ప్రారంభోత్సవం చేసి అక్కడే 3 రోజుల పాటు బస చేశారు. అప్పట్లో ఎలాంటి గ్రీనరీ, గ్రాస్ లాన్ లేకుండా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అప్పటి నుంచి పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు ఇపుడు సీఎం వస్తుండటంతో హార్టికల్చర్ శాఖల సమన్వయంతో తీర్చిదిద్దుతున్నారు. గతంలో సీఎం వచ్చిన సందర్భంలో ఆయన పర్యటించే ప్రదేశాల్లో నాటిన మొక్కలకు నీరుపోసే నాథుడు లేక నిలువునా ఎండిపోయాయి. ఒకటో, రెండో మొండిగా బతికి బట్టకట్టాయి. రోడ్లకు మరమ్మతులను అటకెక్కించారు. ఇపుడు అధికారులు, నగర పాలక సంస్థ చేస్తున్న హడావుడి చూస్తూ నగర వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం వెళ్లిపోయిన తర్వాత కనీసం మొక్కలైనా వీరు సంరక్షిస్తే చాలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎపుడూ జనంతో, చెత్తాచెదారంతో నిండుకుని కంపు కొట్టేలా ఉన్న బళ్లారి రోడ్లులోని ఫ్లై ఓవర్ వద్ద శుభ్రం చేసి, అక్కడున్న అన్న క్యాంటీన్‌ను అద్దంలా మెరిపించేస్తున్నారు. తపోవనం, ఫ్లై ఓవర్ బ్రిడ్జి, బళ్లారి రోడ్లు మార్గాల్లో ‘పెద్దాయన’ మెప్పు కోసం సుందరీకరిస్తుండటంతో జనం విస్తుపోతున్నారు. సాధారణ రోజుల్లో ఇలా చేస్తే తామూ మెచ్చుకోమా? అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.