ఐడియా

ఆరోగ్యరక్ష ద్రాక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి రుచిని అందించే ద్రాక్షపండ్లను ఏ వయసువారైనా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకోవాలంటే తరచూ ద్రాక్షపండ్లను తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో విటమిన్ ఎ,సి, బి-కాంప్లెక్స్, కెరొటిన్ సమృద్ధంగా ఉంటాయి. శరీర వ్యవస్థకు అవసరమైన ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలను ద్రాక్ష అందిస్తుంది. ఈ ఖనిజాల వల్ల ఎముకల్లో దృఢత్వం పెరుగుతుంది. ఆస్త్మా రోగులు వీటిని విరివిగా తింటే శ్వాస సంబంధమైన సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. ఊపిరితిత్తులను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ద్రాక్ష కీలకపాత్ర వహిస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపులో మంట వంటి ఇబ్బందులున్న వారు ద్రాక్షపండ్లను రోజూ తింటే ఉపశమనం కలుగుతుంది. అజీర్తి సమస్యకు దివ్యౌషధంగా పనిచేసే ఈ పండ్లను భోజనం అనంతరం తినడం మంచిది. ద్రాక్షపండ్ల గుజ్జుతో ‘ఫేస్‌ప్యాక్’ వేసుకుంటే ముఖంపై మచ్చలు తొలగిపోయి, చర్మం మృదుత్వంతో మంచి నిగారింపును సంతరించుకుంటుంది.