ఐడియా

పెరుగుతో అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరుగు చక్కని రుచిని, అంతే చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే పెరుగు అద్భుత సౌందర్యాన్ని కూడా ఇస్తుంది. పెరుగుతో కొన్ని వంటింటి వస్తువులను జత చేస్తే శరీరం మెరుపులీనడం ఖాయం మరి..
* అరకప్పు పెరుగులో చెంచా వేప పొడి, అరచెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చులా తయారవుతాయి. అంతేకాదు చుండ్రు సమస్య కూడా అదుపులో ఉంటుంది.
* పెరుగులో మెంతి గింజల్ని రాత్రి నానబెట్టి ఉదయానే్న మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి అరచెంచా తేనె, రెండు చుక్కల నిమ్మరసం కూడా కలుపుకుని వెంట్రుకలకు పట్టించాలి. అరగంట తర్వాత జుట్టును కడిగేయడం వల్ల జుట్టుకి కొత్త నిగారింపు వస్తుంది.
* పెరుగు చర్మానికి కూడా సహససిద్ధ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఒక చెంచా శనగపిండి, ఒక చెంచా పెసరపిండి, తేనె, పెరుగు కలిపి ఒంటికి పట్టించాలి. తరువాత నలుగులా రుద్దుకోవాలి. అప్పుడే దుమ్ము, ధూళితో పాటు మృతకణాలు తొలగిపోయి నునుపుదనం సొంతమవుతుంది.
* పెరుగులో పది నిముషాలు నానబెట్టిన తమలపాకును కళ్లపై ఉంచుకుంటే వేడి తగ్గిపోయి, తాజాగా ఉంటుంది.
* పావు కప్పు పెరుగులో అంతే పరిమాణంలో కలబంద గుజ్జు, చెంచా శనగపిండి, నిమ్మరసం, అరచెంచా బాదం నూనెలను మెత్తగా, బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఓ ఇరవై నిముషాల పాటు ఉంచుకుని ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతులీనుతుంది.