ఐడియా

స్టౌని శుభ్రం చేస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టౌపై ఏమైనా పెట్టి కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నామంటే చాలు అవి పొంగిపోయి మొండి మరకలు పడుతుంటాయి. తరువాత వాటిని శుభ్రం చేయడానికి ఎన్నో తంటాలు పడాల్సి వస్తుంది. కానీ కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా స్టవ్‌పై ఉన్న మరకలన్నీ సులభంగా పోగొట్టవచ్చు.
* జిడ్డు మరకలున్న చోట కొన్ని చుక్కల వెనిగర్ వేయాలి. రెండు నిముషాల తరువాత దాన్ని ఒక స్పాంజీతో తుడిస్తే మరకలు పోతాయి. కానీ మార్బుల్‌తో చేసిన వాటిపై వెనిగర్ వేయకూడదు. మొండి మరకలన్నీ వేడినీటితో తుడిచేసి తరువాత బేకింగ్ సోడాని చల్లాలి. నైలాన్ వస్త్రం లేదా ఒక స్క్రబ్బింగ్ స్పాంజీతో దాన్ని గట్టిగా రుద్దాలి. కొద్దిసేపటి తరువాత వేడినీటితో కడగాలి.
* గినె్నలు కడగడానికి ఉపయోగించే లిక్విడ్ కొన్ని రకాల మరకలను పోగొట్టడానికి సహాయపడుతుంది. దీనిలో బ్లీచ్ ఉంటుంది. ఈ ద్రావణాన్ని మరకలపై చల్లి స్పాంజీతో రుద్ది కడిగేస్తే మరకలు వదులుతాయి.
* ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్ళు కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దీన్ని మరకలపై రాసి బాగా రుద్ది కొద్దిసేపటి తరువాత వేడినీటిలో కడిగేయాలి.
* బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్ల తొక్కలను ఒక గాజు సీసాలోకి తీసుకుని దానిలో కొన్ని చుక్కలు వెనిగర్ వేసి గాలిపోకుండా మూత పెట్టాలి. రెండు వారాల తరువాత మూతతీసి ఆ ద్రావణాన్ని వడకట్టాలి. ఈ ద్రావణంతో వంటగదిలోని ఎటువంటి మరకలనైనా పోగొట్టవచ్చు.