ఐడియా
జుట్టు పెరగాలంటే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అందమైన జుట్టు ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో జుట్టు రాలుతున్న సమస్యతో చాలామంది అమ్మాయిలు బాధపడుతున్నారు. జుట్టు రాలకుండా ఉండేందుకు కాస్మొటిక్ ఉత్పత్తుల కన్నా, సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించడం మేలు.. ఆ చిట్కాలేంటో చూద్దాం..
* జుట్టుకి సహజ పోషకాహారంతో పాటు సంరక్షణ జాగ్రత్తలు పాటిస్తే జుట్టుకి పెరుగుదల ఉంటుంది. పౌష్టికాహారం వల్ల శిరోజాలకు కావలసిన విటమిన్స్ అందుతాయి. ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టి పెరిగేందుకు సహాయపడతాయి.
* జుట్టుకి స్వచ్ఛమైన కొబ్బరినూనెని వేడిచేసి గోరువెచ్చటి నూనెతో తలకి మసాజ్ చేయాలి. ఆ తరువాత తలస్నానం చేస్తే జుట్టుకి మంచి రక్తప్రసరణ జరిగి ఒత్తయిన జుట్టు సొంతమవుతుంది.
* మానసిక ఇబ్బందులకు దూరంగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా మానసిక కారణాల వల్లే జుట్టు ఊడుతుంది.
* ఆయిల్ మసాజ్ చేసుకున్న తరువాత తలస్నానం చేసేందుకు మంచి షాంపూలను ఎంచుకోవాలి. తలస్నానం తరువాత మంచి కండీషనర్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల జుట్టు రాలకుండా దృఢంగా ఉంటుంది.
ఇలాంటి సులభమైన చిట్కాలు పాటించడం వల్ల శిరోజాలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.