తెలంగాణ
లాయర్ల సమ్మె విరమిస్తేనే జోక్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 3 July 2016
లాయర్ల సమ్మె విరమిస్తేనే జోక్యం
స్పష్టం చేసిన సిజెఐ
న్యూఢిల్లి:న్యాయమూర్తుల విభజనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు చేపట్టిన సమ్మెను విరమిస్తేనే తాము ఆ వివాదంలో జోక్యం చేసుకుంటామని సిజెఐ ఠాకూర్ స్పష్టం చేశారు. తెలంగాణ న్యాయవాదుల ఐకాస సభ్యులు తెలిపారు. ఈ వివాదంపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో ఆదివారం వీరు సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు తాము లేవనెత్తిన అంశాలన్నింటినీ ఆయన సావధానంగా విన్నారని వారు చెప్పారు. అయితే సమ్మె విరమిస్తేనే తాము జోక్యం చేసుకుంటామని, లేనిపక్షంలో తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన చెప్పారని, అందువల్ల త్వరలో సమావేశమై సమ్మె విరమణపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.