ఐడియా

వారం రోజుల్లో జలుబుకి చెక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందులు వేసుకుంటే ఏడురోజులకు, అవి వేసుకోకపోతే ఎనిమిది రోజులకు జలుబు తగ్గిపోతుందనే నానుడి మనందరికీ తెలుసు. సీజన్ మారిందంటే చాలు చాలామందిని జలుబు పట్టి పీడిస్తుంది. ఇంటి వైద్యం చేసుకుంటే యాంటీబయాటిక్స్ వేసుకోకుండానే జలుబును తగ్గించుకోవచ్చు.
* జలుబు చేసినపుడు వేడి నీళ్లలో పసుపు బదులు యూకలిఫ్టస్ ఆకులను వేసి మరిగించి ఆ నీటిని ఆవిరి పట్టండి.
* వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే రాత్రివేళలో జలుబు నుంచి త్వరితగతిన ఉపశమనం పొందవచ్చు.
* చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క కలిపి వేడి నీటిలో మరిగించి ఆ నీటిలో కాస్త తేనె కలుపుకొని తాగితే మంచిది.
* జలుబు తగ్గించుకోవటానికి తులసి బాగా పనిచేస్తోంది. గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఉప్పు కలిపి బాగా నమిలి, ఆ రసాన్ని తాగితే జలుబు తగ్గిపోతుంది. తులసి ఆకులతో టీ చేసుకుని తాగినా వెంటనే ఉపశమనం కలుగుతుంది.