విజయనగరం

అంగన్వాడీల కనె్నర్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టరేట్ ముట్టడి
పెంచిన జీతాలు చెల్లించాలని డిమాండ్
సిపిఎం, సిఐటియు నేతల అరెస్టు
విజయనగరం,నవంబర్ 27: రాష్ట్రప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు పెం చిన వేతనాలను చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం పెంచిన జీతాల జిఓ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించి న పోరాటానికి సిపిఎం, సిఐటియు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయి. చిత్తశుద్ది ఉంటే వెంటనే జిఓ విడుదల చేసి ఉద్యోగుల బకాయి వేతనాలు, కేం ద్రాల నిర్వహణ ఖర్చుల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాం డ్ చేసారు. జిల్లా అధికారులు వచ్చి జీతాలు ఎపుడు చెల్లిస్తారో చెప్పాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తు ఆందోళనకు దిగగా, సిపిఎం, సిఐటియు నాయకులు పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించినపుడు పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు ప్రజాసంఘాల నాయకులను ఒక్కరిగా కలెక్టరేట్ గేటు లోపలికి తీసుకువెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కొం దరు నాయకులను అరెస్టుచేసి పోలీసు వాహనంలోకి ఎక్కించి తరలించే ప్రయ త్నం చేస్తుండగా జీపులకు అంగన్‌వాడీలు అడ్డంపడి తరలింపును ప్రతిఘటించారు. కలెక్టరేట్‌లో అదుపులోకి తీసుకున్న పలువురు నాయకులను పోలీసు వాహనంలో బయటకు తీసుకువచ్చినపుడు పెద్దఎత్తున ప్రతిఘటన ఎదురయ్యింది. దీంతో వ్యూహం మార్చి న పోలీసులు రోప్‌పార్టీని ముందు నిలబెట్టి మహిళా కానిస్టేబుళ్లను రంగంలోకి దించారు. వాహనానికి అడ్డుపడుతున్నవారిని పక్కకు లాగి మరీ పోలీసు వాహనాన్ని ముందుకు పంపించారు. ఇంత లో జాయింట్ కలెక్టర్ రామారావు ఆం దోళన చేస్తున్న అంగన్‌వాడీల వద్దకు వచ్చి బకాయిపడిన జీతాలు, కేంద్రం నిర్వహణ ఖర్చులను డిసెంబర్ 10లోగా విడుదల చేస్తామని, దీనికోసం అవసరమైన నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పెంచిన జీతాలకు సంబంధించిన జిఓ విడుదల ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలపటంతో అంగన్‌వాడీలు తమ ఆందోళన విరమించారు.