విజయనగరం

సక్రమంగా ఎన్నికల పోలింగ్‌ను నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారులు సక్రమంగా ఎన్నికలను నిర్వహించేందుకు కృషి చేయాలని బొబ్బిలి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి హెచ్‌వి జయరాం కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం జోనల్, రూట్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఏ పోలింగ్ కేంద్రాలలోనైన ఎటువంటి సమస్యలున్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జోనల్, రూట్ అధికారులు అప్రమత్తంగా ఉండి విదులు నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణలు ఇవ్వడంతోపాటు తగు సూచనలు, సలహాలు అందించామన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ బాలాజీ ప్రసాద్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఆర్నేపల్లి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
ప్రతిష్టకు సిద్ధమైన రామాలయం
బొబ్బిలి(రూరల్), ఏప్రిల్ 9: పట్టణ పరిధిలోని దావాలవీధిలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారాముల ఆలయంలో శ్రీసీతారామచంద్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈనెల 11వ తేదీన నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వివిధ రకాల పూజలు చేశారు. వేమకోటి మల్లిఖార్జున శర్మ, నీలకంఠశర్మల ఆధ్వర్యంలో 3 రోజులపాటు వివిధ రకాల పూజలను నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం కూడా వివిధ రకాల పూజలు చేస్తున్నామన్నారు. 10వ తేదీన ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 8గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు కార్యక్రమాలను చేపడతామన్నారు. 11వ తేదీ ఉదయం 7.14ని.లకు విగ్రహప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే 11వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.

600 చీరలను స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి
బొబ్బిలి(రూరల్), ఏప్రిల్ 9: స్థానిక సూర్యారెసిడెన్సీలో 48వేల రూపాయలు విలువగల చీరలను మంగళవారం స్వాధీనం చేసుకున్నామని ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారి ఎం శ్యాంసుందర్ తెలిపారు. ఈమేరకు ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సూర్యారెసిడెన్సీలో చీరలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేశామన్నారు. ఈ సందర్భంగా 600 చీరలను పట్టుకున్నామని, వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హెచ్‌వి జయరాంకు అప్పగించామన్నారు. అయితే ఈ చీరలను తారకరామాకాలనీకి చెందిన ప్రసాద్ రజస్వల ఫంక్షన్‌కు తెచ్చినట్లు కార్డులు చూపించాడన్నారు. దీనిపై ఆర్‌ఓ నిర్ణయం తీసుకోవల్సి ఉందన్నారు. ఈ తనిఖీలో ఏఎస్‌ఐ భాస్కరరావు, తదితరులు ఉన్నారు.

ఘనంగా నూకాలమ్మ గ్రామదేవత ఉత్సవాలు
బొబ్బిలి(రూరల్), ఏప్రిల్ 9: మండలం అలజంగి గ్రామంలో మంగళవారం నూకాలమ్మ గ్రామదేవత ఉత్సవాలను భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రతీ ఏటా ఈ ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది కూడా ఘనంగా జరుపుకున్నామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు సూర్యనారాయణ, లక్ష్మునాయుడు, తదితరులు ఏర్పాట్లు చేశారు. వేలాదిమంది ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా గ్రామశివారులో ఉన్న అమ్మవారి గుడికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడ అమ్మవారికి పసుపుకుంకుమ, చీరలను సమర్పించారు.

టీడీపీ అఖండ మెజార్టీతో గెలిపించండి
జియ్యమ్మవలస, ఏప్రిల్ 9: కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విటి నరసింహాప్రియ థాట్రాజ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం మండలంలో గల చినమేరంగి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను దృష్టి పెట్టుకుని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చినమేరంగి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, టీడీపీని గెలిపించి మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కురుపాం టీడీపీ అభ్యర్థి నరసింహాప్రియ థాట్రాజ్ మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలో ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని, తన అన్న శతృచర్ల సహాయ సహకారాలతో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గం పరిధిలో గల 5మండలాల్లో టీడీపీ బలోపేతంగా ఉందని, సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మజ్జి చంద్రవౌళి, వట్టిగెడ్డ రిజర్వాయర్ ప్రాజెక్టు ఛైర్మన్ బలగ వెంకటరమణ, చినమేరంగి మాజీ సర్పంచ్ బి ప్రకాష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.