Others

ఆశ ఖరీదు అణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(బాజాలు అలా అలా దూరం అయిపోయి, మళ్లీ గల్లీలో వాహనాల చప్పుళ్ళూ జనసమ్మర్దం అవీ వినబడతాయి)
యు:వెళ్లిపోయింది అమ్మాయి. పేరు అడుగుదామనుకున్నాను, భయం వేసింది. ఎందుకో! మన భయాలన్నీ యిలాగే వుంటాయి. ముక్కూ మొహం ఎరగని నాతో నిర్భయంగా జంకూ గొంకూ లేకుండా మాటాడింది. బజాలు విని హడలిపోయి తుర్రుమని లోపలికి పారిపోయింది. కొందరికి చావంటే భయం. మరికొందరికి బతుకంటే భయం.. ఎక్కడికో రుూ మనుషులంతా? ఎన్ని కార్లు! ఎన్ని కార్లు! వాటిల్లో అందమైన ఆడవాళ్ళూ! ఖరీదైన మగాళ్లూ- ఎవళ్ళో వాళ్ళంతా? ఎక్కడికి వెడుతున్నారు అంత హడావిడిగా? రంగు రంగుల పానీయాల మత్తందనాల్లోకి- తాంబూలాల సువాసనల్లోకి- అగరుధూపాల అరమోడ్పు కన్నుల అవతలి గట్టులకి.
(సైకిల్ బెల్ చప్పుడు)
ఒక పడుచువాడు: హలో! కొంచెం దారి యిస్తారా? సైకిల్ గుమ్మం గట్టు దాటించి లోపలికి తీసుకుపోతాను. లోపలి వాటాలో ఉంటున్నాం లెండి!
యు: తప్పకుండా.
పడు:్థంక్స్.. మీరేనా మేడ గదిలోకి కొత్తగావచ్చింది?.. పొద్దున్న యధాలాపంగా చూశాను. మీరే అనుకున్నాను. కుటుంబంతోనే వచ్చారా?
యు: లేదండి, ఇంకా పెళ్లికాలేదు.
పడు: ఓహో.. వస్తానండీ, మావాళ్ళు కనిపెట్టుకుంటారు. కనిపిస్తూనే ఉంటాలెండి. నేను బాంకులో పనిచేస్తున్నాను. మీ ఎకౌకంటు ఏ బాంకులో ఉంది?
యు: నా ఎకౌంటండీ- నా జేములోనే ఉంటుందండి. పైగా అది ఖాళీగా ఉండే సమయాలే ఎక్కువ.
పడు: బాగా చెప్పారు!
(కాస్త దూరం నుంచి ‘లోపలికి రావేంరా నాయనా’ అని ఒక ప్రౌఢ స్ర్తి కంఠం)
పడు:ఒస్తానండి! మా అమ్మ పిలుస్తోంది. మా ఆవిడ కూడా కనిపెట్టుకుంటుందీ....
(దూరం నుండి రేడియోలో జంత్ర సమ్మేళనం సన్నగా వినబడుతుంది)
మా పై వాటాలోవాళ్లులెండి.. కూతుళ్ళకు పెళ్లిళ్ళు చెయ్యరు గాని.. ఇరవై నాలుగ్గంటలూ గ్రామఫోన్లు పెట్టుక్కూర్చుంటారు.. ఇందిరా, ఆనందలక్ష్మి.. ఆహా.. పేరు గొప్పా ఊరు దిబ్బా అన్నాడు.
(జంత్ర సమ్మేళనం తీవ్రంగా వినబడుతుంది)
యు:ఇందిరా, ఆనందలక్ష్మి! ఎంత మంచి పేరు ఎందుకో మరి రుూ సైకిల్ యోధుడికి నచ్చలేదు. పెళ్లిగాని అమ్మాయిలూ, బ్యాంక్ ఎకౌంట్ లేని నాలాంటివాళ్ళూ అతనికి నచ్చరు. అలా నచ్చనివన్నీ ఏరిపారేయగా అతనికి మిగిలింది చాలా చిన్నలోకం అయుండాలి. తనూ, తన కుటుంబం, ఉద్యోగం, ఇంక్రిమెంటూ, తమ్ముడి ఉద్యోగం, చెల్లెలి పెళ్లి అంత చిన్న లోకాన్ని పదిలంగా రూపాయి కాగితంలో పొట్లం గట్టి మర్యాద బ్యాంకు లో డిపాజిట్ చేసేసి ఉంటాడు.. ఇందిరా- ఆనందలక్ష్మి! వాళ్ళ గురించి కొంచెం తెలిస్తే బాగుండును! నేను గోడలకి మేకలు కొడితే ఆ ఇందిరకి నిద్రాభంగం! ఇప్పుడేం చేస్తున్నారో వాళ్ళు!?
***
లక్ష్మీ:ఇందిరా!ఇందిరా!
ఇం:(ప్రవేశిస్తూ) ఏం లక్ష్మీ?
లక్ష్మి:అన్నయ్యింకా రాలేదేమే? ఇంత రాత్రయిందీ! నాకెందుకో భయం వేస్తోంది.
ఇం:వస్తాడు, జేబులో కానీ కూడా లేదాయె. ఎక్కణ్ణించి నడుచుకుంటూ రావాలో!
లక్ష్మి: అమ్మకి కాస్త కునుకుపట్టినట్టుంది. నువెల్లి భోజనం చెయ్యరాదూ? వెళ్లు. నేను కూర్చుంటాను అమ్మ దగ్గిర.. తరవాత మళ్లీ బార్లీ నీళ్ళూ అవీ కలపాలా!
ఇం: ఇంకేమిటో ఆకలిగా లేదు లక్ష్మీ! అక్కడ నాన్నకి జెయిల్లో గంజినీళ్ళూ ఇక్కడఅమ్మకి జబ్బు మంచం మీద బార్లీ నీళ్ళూ.
లక్ష్మి:ఆపేశావేం? అన్నయ్యకి ఉద్యోగం ల ఏదు, మనకి పెళ్లి లేదు- లిస్టు చాలా ఉంది.
ఇందిర: అదికదా లక్ష్మీ, తలుచుకుంటే నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు. ఉన్న ధైర్యం ఏవిటంటే, ఇంతకన్నా అట్టడుక్కి వెళ్లడానికి ఇంకేం వుందని!
లక్ష్మి:అలా అనకు. దిగినకొద్దీ సముద్రం లోతు, ఎక్కినకొద్దీ ఆకసం ఎత్తూ- అలా ఉంటూనే వుంటాయి. వెళ్లి భోంచేసి రావూ?
ఇం:ఏం భోజనమే! ఆకల్లేదు. అలా పడుకోవాలని ఉంది. మెలకువకంటే నద్ర నయం. మంచి కలలైనా వస్తాయి.
లక్ష్మి: ఏమిటీ హామీ! తీరా చేసి పీడకలలు వస్తే?
ఇం:చంపేశావు! మేలుకుంటేనీడ, నిద్రపోతే పీడ! ఏం దారి మరి?
లక్ష్మి:రెండింటికీ మధ్య ఏదో మగతగా బతికేస్తే సరి!
ఇం:అంతేనంటావ్! సరేలే.. ఇప్పుడు చేస్తున్నదీ అంతే.. హాయిగా ఎవరైనా పాడితే బాగుండును! ఏదైనా ఒక పాట- మైమరపించేది, హాయనిపిచేది..
ల:పాడిన కాస్సేపూ బాగుంటుంది. ఆ తరువాత?
ఇం:కాస్సేపు బాగున్నా చాలు.. పోనీలే.. నాన్న రుూ నిముషాన జైల్లో ఏం చేస్తున్నాడో?
ల:నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక

వినమరుగైన..

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003