Others

అవసరం విచక్షణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వీకులు సమాజం యొక్క మేలుగోరి మానవాళి సౌకర్యార్థం కొన్ని నియమాలు చేయవలసిన కార్యక్రమాలు ఏర్పరిచారు. వాటిని ప్రతివారూ ఆచరిస్తే సుఖ సంతోషాలతో జీవించవచ్చు అని చెప్పారు. వారు చెప్పిన పనులు సమాజ శ్రేయస్సుకు ఎంతో ఉపయుక్తమనీ, సమాజాన్ని సన్మార్గంలో నడపడానికి ఎంతో అవసరమనీ తలచినవారు వాటినే ‘సత్సంప్రదాయాలు’ అని అన్నారు. అవి మంచిని వర్థిల్లజేసేందుకు బాగా ఉపయోగపడేవి.
క్రమానుగతంగా అవి తప్పనిసరిగా ఆచరించే కార్యక్రమాలుగా, నియమాలుగా మారిపోయాయి. ఆ సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకొనే వాళ్ళను సమాజం సంప్రదాయ వ్యతిరేకులుగా ముద్ర వేశారు. కానీ ఇపుడు పాతది బంగారం అనే రోజులు వస్తున్నాయ. అన్నింటిలో కాకపోయనా కొన్నింటిలో మనం ఆలోచించాలి. విషయాన్ని సాంతంగా ఆలోచించాలి. అది ఎంతవరకు సహేతుకమో చూడాలి. చేసే పని వల్ల మంచి జరుగుతుందా లేదా అని ఆలోచించాలి. అపుడు పాత తరం వాళ్లు చెప్పిందా కొత్త తరం వాళ్లు చెప్పిందా అని కాక పని వల్ల సత్ఫలితం వస్తుందా లేదా అని ఆలోచించాలి. అపుడు ఏకాలంలోనైనా ఆ సంప్రదాయాలు సత్ సంప్రదాయాలుగా మిగులుతాయ. ఏ పని చేసినా అది పవిత్ర హృదయంతో చేయాలి. నలుగురికి ఉపయోగపడేటట్టు చేయాలి. స్వార్థం విడనాడాలి. పండుగలు, పబ్బాలు, ఉత్సవాలూ ఊరేగింపులూ జాతరలూ ఏయే సమయాల్లో ఎలా నిర్వహించాలి అనేవి కూడా ఇంతవరకు సంప్రదాయానుసారమే నిర్వహించబడతాయి. పండుగల సందర్భాల్లో అభ్యంగన స్నానాలు చేయడం, కొత్త బట్టలు ధరించడం, దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం అనేవి ఇంతకు ముందునుంచి ఉన్నవే పాటిస్తున్నారు.
జనన, మరణాల సమయాల్లో పాటించవలసినవి. శిశు జనన సందర్భంలో తిథి, వార, నక్షత్రాదులను గమనించడం, వాటివల్ల శిశువు యొక్క గ్రహస్థితి భవిష్యత్తు ఎలా ఉంటుందో జ్యోతిష్కుల నడిగి తెలుసుకోవడం వారిచ్చిన సూచనలమేరకు శిశువుయొక్క పేరు నిర్ణయించడం, బారసాల మొదలైనవి చేయడం జరుగుతోంది. శిశువుకు ఏదైనా దోషం ఉందని తెలిస్తే గ్రహశాంతి కోసం చేసే పూజలు మొదలైనవి
కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు సంప్రదాయానుసారంగా ఖననం చేయడమో లేక దహనం చేయడమో జరుగుతోంది. దైవజ్ఞుల సూచనలమేరకే దశ దిన కర్మలూ, పిండ ప్రదానాలూ దాన ధర్మాలూ చేయడం లాంటివి కూడా అనాదినుంచి వస్తున్నవే. కనుక వీటిల్లో ఇప్పటి కాలానికి ఏది మంచిది అని ఆలోచించి చేయాలి. చేసే పనుల వల్ల లాభం కలుగుతుందా లేదా అని ఆలోచించుకుంటే చాలు. అంతేకానీ అనాది నుంచి వస్తున్నది కదా అని ఇపుడుకీడు జరిగినా అదే చేస్తాననడం మూర్ఖత్వం. అట్లాకాక పాత పద్ధతి అయనా ఇపుడు మేలు జరుగుతుంది అంటే పాతది కనుక చేయను అనడం కూడా మూర్ఖత్వమే.
అందుకే ఎపుడైనా దేనికైనా విచక్షణ ఉండాలి. విచక్షణతో మంచి చెడు ఆలోచించుకోవాలి. అపుడు నిర్ణయంచుకోవాలి.

- లక్ష్మి