Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి బావ
*
- షణ్ముఖశ్రీ 8897853339
*
శ్రీనివాస్:నేను కూడా మధ్య మధ్యలో అంతేనండీ! నన్ను చూశాక మీకేమనిపించింది. హీరోలాగాలేనా?
వసంత: అలాగే వుంటారు ముందు. ఆ తర్వాతగా విలన్‌గానో, రేపిస్టుగానో మారేది. బుద్ధిలేని మగబుద్ధి అంతే.
శ్రీనివాస్: ఆ పాపిష్టివాళ్ళ మాట నా దగ్గర ఎత్తకండి. మిమ్మల్ని చూడగానే మీ కళ్ళు నన్ను కట్టేశాయ్. నేనే పెద్ద హీరోగా ఎదిగిపోయానన్న ఫీలింగ్ సీలింగ్ ఫ్యాన్‌లా గిరగిరా తిరిగిపోతోంది.
వసంత: (తనలో) మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. (పైకి) ఫ్యాన్‌లా తిరిగిపోవడానికి స్విచ్ వేయబయే ఆ హీరోయిన్ ఎవరో!
శ్రీనివాస్: ఒకవేళ మీరేనేమో!
వసంత: ఆ ఆశలేం పెట్టుకోకండి.
శ్రీనివాస్: పెట్టుకోకుండా ఎలా ఉండగలను? ప్రేమబాటలో పయనించే నేను ఊరిపోతూ, ఊరిని ఊపిరినీ, అసలీ ప్రాపంచిక విషయాల్నే మర్చిపోయి ఎక్కడికో పోతుంటాను.
వసంత: ప్రాపంచిక విషయాల్ని మర్చిపోయేది సన్యాసులు.
శ్రీనివాస్: ఓ అయామ్ సారీ! అవునవును. సన్యాసులు. సన్యాసులు.
వసంత: మీరు కూడా వాళ్ళ దగ్గర కెళ్ళడమే బెటర్.
శ్రీనివాస్: అదేమిటి సడెన్‌గా అలా అనేశారు.
వసంత: (తనలో) వీడ్ని ఇంటర్‌నెట్ పెళ్ళికొడుకనుకున్నా. ఇంటర్‌మీడియెట్ కూడా పాసు కాని ఈడియట్‌లా వున్నాడు.
(పైకి) అలా అనక ఎలా అంటాను.
శ్రీనివాస్: మీ బ్రైన్ చాలా షార్పు. ఇంతలోనే ఎంత మెత్తగా దెబ్బకొట్టారు.
వసంత:అందమైన దాన్ని కదండి! అలానే ఉంటుంది మరి.
శ్రీనివాస్:మీకోసం ఎన్ని దెబ్బలయినా తట్టుకునే గుండె ధైర్యం నాకుందండి. అయినా ఇంతసేపు వాగినా కొంచెం కాఫీ అన్నా ఇచ్చారు కాదు.
వసంత: (తనలో) ఏమిటింత చనువు. అయినవాడేనేమో! అయుండొచ్చు. లేకపోతే ఇంత ధైర్యంగా లోపలికొచ్చి కాఫీ కూడా అడుగుతాడా?
(పైకి) కాఫీదేముంది, ఇపుడే తెచ్చిస్తాను, కూర్చోనుండండి.
(విరామ సంగీతం)
శ్రీనివాస్:(తనలో) ఆమె వచ్చేస్తుండగానే ఆమె చూసేలా ఇక్కడున్న ఆమె ఫొటోతో మాట్లాడుతుంటాను. అదుగదుగో వచ్చేస్తోంది. మెదలెట్టేస్తాను..
(పైకి) నిన్ను చూసిన క్షణంనుంచీ నాలో వసంతం వెల్లివిరిసింది. నీ గులాబి బుగ్గలూ, చలాకి కన్నులూ, మల్లెమొగ్గల్లాంటి ముద్దు పలుకులూ వదిలి వెళ్లాలని లేదు. ఇక్కడే వుండిపోయి, నిన్ను నాలో దాచుకొని, ఇన్నాళ్ళూ నాలో దాగిన మధుర స్వప్నాల్ని సుమధుర భావాల్ని నీతో కలిపి నిజం చేసుకోవాలనిపిస్తోంది.
(తనలో) కాఫీతో వస్తూ నా మాటలు వింటూ అక్కడే ఆగిపోయింది. ననే్న చూస్తోంది. నేనామెను చూడనట్లే ఇంకొంచెం పొగుడుతాను.
(పైకి) నీ ముందు మేనక మేకలా వుంటుంది. రంభ రోతలా వుంటుంది. ఊర్వశి ఊపిరి లేనట్లుంటుంది. నువ్వు మాత్రం సిరివెనె్నలలో, శృతి లయలతో శంకరాభరణం ఆలపిస్తూ, స్వయంకృషితో, సప్తపది కోసం ఎదురుచూస్తున్న స్వాతి ముత్యంలా ప్రకాశిస్తూ, నీ శుభ సంకల్పం నెరవేరడానికి స్వరాభిషేకం చేస్తున్న స్వర్ణకమలంలా, నా మదిలో మెదులుతున్నావ్. (వసంత కిలకిలా నవ్వింది)
శ్రీనివాస్: (తనలో) నవ్వుతోంది. ఇలాంటప్పుడే అసలు విషయం బైటపెట్టాలి. (పైకి) అలాంటి నిన్ను చూసిన ఎవరికైనా ప్రేమించాలని, పరవశించాలనీ అనిపించదా? ఆ ఆశ చిగురించదా? అందుకేగా నిన్ను గాఢంగా, గూఢచారిలా ప్రేమిస్తూ ప్రతి నిమిషం చలించిపోతున్నాను. ఎంతని చెప్పను. ఏమని చెప్పను.
వసంత: (దగ్గరగా వచ్చి) నేను మీ దగ్గర కొచ్చి చాలాసేపైంది. మీరు మనుషులతో కన్నా ఫొటోలతోనే బాగా మాట్లాడుతారులా వుంది. మీకేదైనా ఫొటో స్టూడియోగానీ వుందేమిటి? ఇంతకూ ఆ ఫొటోకేదో చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్పారేమిటి?
శ్రీనివాస్: (చూడనట్లుగా చూసి) అరే! వచ్చేశారా! గమనించనే లేదు. (నవ్వి) బాగా కనిపెట్టేశారు. నా హృదయంలోని ఫొటోతో నేను బాగా మాట్లాడుతాను. అలాగే ఆ ఫొటోలోని హృదయం కూడా నాతో బాగానే మాట్లాడుతుంది.
వసంత: ఆ మాటలేవో తర్వాత విందురుగాని, ముందీ కాఫీ తీసుకోండి. చల్లారిపోతుంది.
శ్రీనివాస్: ఇలా ఇవ్వండి. మీ చేతి కాఫీ అంత త్వరగా చల్లారదులేండి. వేడిగానూ వుంది. రుచిగానూ వుంది. అచ్చు మీ ఫొటోలానే వుందంటే నమ్మండి.
వసంత: అంటే నా మొహంలా వుందనా?
శ్రీనివాస్: అబ్బ! ఎంత కరెక్టుగా చెప్పారు.
వసంత: అయితే మీరిక దయచేయొచ్చు.

(ఇంకావుంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.