Others
సూర్య శతకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తే.గీ బుద్ధికొరవడ దుర్మార్గపుం బనులకుఁ
బూనుకునువారలధికులై పుడమినంతఁ
బట్టి కుదిపేయు వారలఁబట్టి కఠిన
శిక్షలను వేయ మున్ముందుఁ జేయఁబోరు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: బుద్ధి తక్కువతనంవల్ల దుర్మార్గపు పనులు చేసేవారు ఎక్కువైపోయి ఈ భూమండలాన్ని పట్టి కుదిపేస్తున్నారు. అలాంటివారిని కఠినంగా శిక్షించినపుడే ముందు ముందు ఘోరాలకు పాల్పడకుండా ఉంటారు కదా! అలాంటివారికి కఠినశిక్షలు పడేలా చూడవయ్యా సూర్యదేవా!
తే.గీ తారతమ్యములెఱుగకఁ దప్పులొప్పు
లను విచారము సేయకీ యవనియందు
మెలగువారికి గుణపాఠములనుఁజెప్ప
వలయునో స్వామి! లేకున్న బాగుపడరు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: తారతమ్యాలు గ్రహించకుండా, తప్పొప్పులను విచారించకుండా ప్రవర్తించేవారికి కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! గుణపాఠాలను తెలియజెప్పు స్వామీ! లేకుంటే అలాంటివారు బాగుపడరు సరికదా! ఇతరులను కూడా చెడగొడతారు స్వామీ!