Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి బావ
*
శ్రీనివాస్: అదేంటండీ అసలు విషయం తెలుసుకోకుండానే పంపిస్తారా? (ఇంతలో వసంత సెల్ మ్రోగింది. ఆన్ చేసింది)
వసంత:ఆ! హలో! ఆ! అలాగే! ఫరవాలేదు. ఓకె! నో ప్రాబ్లమ్. అర్థమైంది నో వర్రీ, అలాగే! (సెల్ ఆఫ్ చేసింది)
శ్రీనివాస్:సరేనండి. అలాగే వెళ్తాను. కాఫీ అడగడం, మీ ఫొటోతో మాట్లాడడం నేరమవుతుందనుకోలేదు. నన్ను మన్నించండి. వస్తాను.
వసంత:(తనలో) వీడ్ని పోనిస్తే కథ అడ్డం తిరుగుతుంది. పోనివ్వకూడదు. ఏదో రకంగా ఆపాలి. (పైకి) ఆగండాగండి. ఎక్కడికెళ్తారు? నేను దాన్ని జోక్‌గా తీసుకొన్నాను. అయితే నిజం చెప్పి మరీ కదలండి. ఆడజాతి వున్నది మీ మృగజాతికి. అదే ఐమీన్ మీ మగజాతికి కాలక్షేపానికి కాదని గ్రహించండి. పిచ్చివేషాలు వేసిన ఓ పిచ్చివాణ్ణి కటకటాలకు పంపించాను. ఇంకా అక్కడే వున్నాడు. వెళ్దాం రండి చూపిస్తాను.
శ్రీనివాస్:కటకటా! ఏమీ నా గతి. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. పొమ్మంటే ఇపుడే పారిపోతాను.
వసంత: చెప్పదలచుకొన్న చెత్తంతా చెప్పి వెంటనే వెళ్లండి.
శ్రీనివాస్:అయితే మీ ఫొటోతో వాగిందంతా మళ్లీ మీతో వాగమంటారా?
వసంత:అంటే
శ్రీనివాస్: అంటే గింటే ఏం లేదు. మీకంటె అందగత్తె నా దృష్టిలో ఎవరూ లేరు. నా మనోరథాన్ని మీకు తెలయజేయడానికే అలా వాగాను.
వసంత: (తనలో) నువ్వు అందగత్తెవు అనంగానే ఆడవాళ్ళు వెంటనే మెత్తబడతారు. వెంటపడతారు. (పైకి) నన్ను అంత ఇదిగా, అంత అదిగా ప్రేమతో ముంచేస్తామంటున్నారు. ఇంతకుముందు ననె్నక్కడ చూశారు.
శ్రీనివాస్:వంటిపైన నూలుపోగైనా లేనప్పుడు ఒకసారీ, నిండుగా శారీలో వున్నపుడు ఈసారీ చూశాను. చూశాను. చూస్తూనే వున్నాను. చూస్తాను. హాయ్.
వసంత:ఓయ్! ఏమిటీ అధిక ప్రసంగం.
శ్రీనివాస్:అధిక ప్రసంగం కాదు. అసలు విషయం. ఇందాక చెప్పినట్లు ఇరవై అయిదేళ్ల క్రితం అలా. మళ్లీ ఈమధ్యలో ఒక రాత్రి. అదే ఆ మరువలేని రాత్రి. మీరు మర్చిపోయారేమో నేను మాత్రం మర్చిపోలేకుండా వున్నాను. అందుకే మీ ముందుకు వచ్చి వాలాను.
వసంత:ఏ రాత్రి? ఎప్పుడు? ఎక్కడ? ఎవర్ని చూసి ఎవరనుకున్నారో?
శ్రీనివాస్:నో డౌట్! మిమ్మల్నే ఆ రాత్రే. ఆ అంధకార బంధురమైన రాత్రి. సరిగ్గా 12 గంటల సమయం. నేను నా గదిలో ఏకాంతంగా పడుకోనుండగా, నా గదిలోకి వచ్చిన మిమ్మల్ని.. చూశాను. మీ యవ్వన శోభ ననె్నంత ఉక్కిరిబిక్కిరి చేసిందో మీకేం తెలుసు. మీ చేతిలో పాల గ్లాసు ఒక్కటే తక్కువ. అయినా మీరు నమ్మరులేండి.
వసంత:ఏయ్ మిస్టర్ ఏమిటా వాగుడు. నేనేమిటి? మీ గదిలోకి రావడం ఏమిటి? ఎవరన్నా వింటే నిజమేననుకొనేరు.
శ్రీనివాస్:ఇందులో అక్షరం అబద్ధం లేదు. ఆ రాత్రి.. చలికి.. కిటికీ తలుపులు మూసి, రగ్గు కప్పుకొని పడుకున్నాను. ఆ వెనె్నల రాత్రిని నేను ఎప్పటికీ మరువను. మీరొచ్చి తలుపు తట్టారు. నేను వెళ్లి తలుపు తీశాను. ఆ తర్వాత..

(ఇంకావుంది)

హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.

- షణ్ముఖశ్రీ 8897853339