సంపాదకీయం

ఇష్రాత్ మిత్రులు ఏమంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రభుత్వానికి తొత్తులైన జిహాదీ ఉగ్రవాదులను అమాయకులుగా చిత్రీకరించడానికి జరిగిన ఒక కుట్ర భగ్నమైంది. ఇష్రాత్ జహాన్ అనే బీభత్సకారిణి పాకిస్తానీ లష్యర్ ఏ తయ్యబా ముఠా సభ్యురాలని డేవిడ్ కాలెమన్ హెడ్లీ ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానానికి గురువారం తెలియజేయడం ఇందుకు ప్రాతిపదిక. 2008 నవంబర్ నాటి ముంబయి బీభత్సకాండను నిర్వహించిన హెడ్లీ కూడ లష్యర్ ఏ తయ్యబా సభ్యుడు. అమెరికాలో జైలుశిక్షను అనుభవిస్తున్న హెడ్లీ గత కొన్ని రోజులుగా దృశ్య మాధ్యమాల అనుసంధానం ద్వారా ముంబయి న్యాయస్థానానికి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సకాండ తీరు తెన్నులను వివరించాడు. ఇష్రాత్ జహాన్ కేవలం విద్యార్థిని అని అమాయకురాలని ఆమెను గుజరాత్ ప్రభుత్వం చంపించిందని పదకొండు ఏళ్లుగా కొనసాగుతున్న ప్రచారానికి కుట్ర పన్నినవారు ఇప్పుడు దేశ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్‌లో మాత్రమే కాక కశ్మీర్‌లో ఈశాన్య ప్రాంతంలో ఇంకా అనేక చోట్ల దేశ ద్రోహులను పోలీసులు, సైనికులు మట్టుపెట్టినప్పుడల్లా..‘అమాయకులను హత్య చేశారన్న’’ ప్రచారం చేస్తున్న తండాలు తాండవిస్తుండడం జాతీయ వైపరీత్యం. హెడ్లీ వెల్లడించిన విషయాల వల్ల ఇప్పుడు ఒక కుట్ర మాత్రమే బయటపడింది. కానీ బయటపడని ప్రచార షడ్యంత్రాలు ఇంకా ఎనె్నన్ని అమలు జరుగుతున్నాయన్నది ఆందోళన కరమైన పరిణామం. దేశద్రోహులను, జిహాదీ బీభత్సకారులను, ఇతరేతర కిరాయి హంతకులను పట్టుకొనడానికి యత్నించిన భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం జగమెరిగిన సత్యం. ఇలాంటి కాల్పులకు దేశభద్రతా పరిరక్షకులైన పోలీసులు, సైనికులు బలైపోతున్నారు. ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది జరిపే ఎదురు కాల్పులలో టెర్రరిస్టులు కూడ హతమైపోతున్నారు. అనేక సందర్భాలలో టెర్రరిస్టులు తప్పించుకొని పారిపోతున్నారు. ఇష్రాత్ జహాన్ అలా హతమైన జిహాదీ బీభత్సకారిణి. సైనికులు పోలీసులు వందల వేల సంఖ్యలో టెర్రరిస్టుల తూటాలకు బలైపోతున్న సమయంలో నోరు మెదపని బౌద్ధిక బీభత్సకారులు ఇలా టెర్రరిస్టులుహతులు కాగానే ‘అమాయకులను చంపేశారు..’ అంటూ అరచి ఆర్భాటం చేస్తున్నారు. దేశభక్తులు బలి అయిపోతే ఒక కన్నీటి చుక్కను కూడ విదల్చనివారు పాకిస్తానీ తొత్తులు హతులైనప్పుడల్లా కన్నీళ్లలో కాలువలను నింపుతున్నారు. ఇష్రాత్ జహాన్ బీభత్స కారిణి అని గతంలోనే ధ్రువపడింది. కానీ గుజరాత్ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు ఘోరమైన అపనిందలకు గురిచేసే కుట్రలో భాగంగా ఈ ధ్రువీకరణను వమ్ము చేయడానికి పదేపదే హత్యలు జరిగాయి. ఈ కుట్రలు హెడ్లీ సాక్ష్యంతో మరోసారి భగ్నమయ్యాయి. ఇష్రాత్ జహాన్ మద్దతుదారులు ఇప్పుడు ఏమంటారు?
డేవిడ్ హెడ్లీ అనే బీభత్సకారుడు మన దేశానికి అనేకసార్లు వచ్చి వెళ్లాడు. లష్కర్ ముఠావారి కలాపాలను విస్తరింపజేశాడు. ఈ విస్తరణలో భాగం ఇష్రాత్ జహాన్, ప్రణేశ్ పిళ్లయ్ అనే పేరుగల జావీద్ షేక్, అంజాద్ అలీ రాణా, జీషన్ జోహార్ అనేవారు తయ్యబా తండాలో చేరారు. గుజరాత్‌లోకి చొరబడిన ఈ దుష్ట చతుష్టయం 2014 జూన్ 15న గుజరాత్ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతులయ్యారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీని హత్య చేయడానికి జరిగిన కుట్రలో భాగంగా ఈ నలుగురూ మహారాష్ట్ర నుండి గుజరాత్‌లోకి చొరబడినట్టు పరిశోధనలో వెల్లడైంది. ఈ ముఠాలో ఒక మహిళ ఉన్నట్టు హెడ్లీ ముంబయి న్యాయ స్థానంలో ఇప్పుడు నిర్ధారించాడు. ఆ మహిళ భారతీయురాలని, అయితే పాకిస్తానీ తయ్యబా తండాలో సభ్యురాలని హెడ్లీ చెప్పాడు. ఆమె పేరు ఇష్రాత్ జహా అని అతగాడు చెప్పడం వల్ల గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిపోయిన ప్రచారాలు, నకిలీ పరిశోధనల గుట్టు రట్టయిపోయింది. ఈ నకిలీ పరిశోధనల ఫలితంగా ఏళ్ల తరబడి జైళ్ల పాలైన గుజరాత్ పోలీసు అధికారులకు న్యాయం ఎప్పుడు లభిస్తుంది? అన్యాయం చేసిన వారిని ఎవరు శిక్షించాలి?
గుజరాత్ పోలీస్ విభాగం ఉన్నతాధికారి డి.జి. వంఝూరా ఎనిమిదేళ్ల పాటు వివిధ రకాల నిర్బంధాలకు గురి అయ్యాడు. ఇష్రాత్ జహాన్ ముఠాను, మరో టెర్రరిస్టును పోలీసులు మట్టుపెట్టిన ‘నేరం’లో ఆయన నిందితుడు. ఆయనతోపాటు అనేకమంది పోలీసులు అధికారులు కూడ ఇష్రాత్ జహాన్ అమాయకురాలన్న ప్రచారానికి బలయ్యారు. జైళ్లపాలయ్యారు. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గుజరాత్ మంత్రులు అప్రతిష్టపాలయ్యారు. పదవీచ్యుతులయ్యారు. ఇష్రాత్ జహాన్ అమాయకురాలన్న ప్రచారం నకిలీ పరిశోధనలు ఇందుకు కారణం. ఈ సుదీర్ఘమైన ప్రహసనం మాటున పాకిస్తానీ జిహాదీ ముఠాలు మరింతగా విస్తరించిపోయాయి. 2008లో పాకిస్తానీలు ముంబయిపై దాడి చేయడానికి ఈ విస్తరణ కారణం. 2014 మే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని హత్యలు చేయించిన మతోన్మాదిగా చిత్రీకరించడానికి కాంగ్రెస్, వామపక్షాలు, నకిలీ హక్కుల సంఘాలు, మేధావుల ముసుగులో పాకిస్తాన్ సమర్ధకులు చేసిన ప్రచారం అంతర్జాతీయ వేదికలపై సైతం మారుమోగింది. అమెరికా, బ్రిటన్ వంటి ప్రభుత్వాలు మోదీ తమ దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేదని ప్రతిజ్ఞలు చేయడం పాకిస్తాన్ తొత్తుల పన్నాగానికి పరాకాష్ఠ. ‘ఇష్రాత్ జహాన్ అమాయుకరాలైన బాలిక’ అన్న అబద్ధం ప్రాతిపదికగా ఈ కాండ జరిగిపోయింది. ఈ అన్యాయానికి ఎవరు శిక్షను విధిస్తారు? ఇష్రాత్ జహాన్ టెర్రరిస్టు అన్న నిజాన్ని వమ్ము చేయడానికై కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2014మే వరకు పోరాడింది. సీబీఐని రంగంలోకి దింపి ఇష్రాత్ నిర్దోషి అని ప్రచారం చేయించింది. మరే ఇతర దేశంలోను లేని విధంగా దేశద్రోహులకు, బీభత్సకారులకు అండగా నిలబడే ముఠాలు ఎప్పటికప్పుడు పుట్టలు పుట్టలు పగులుతుండడం నడచిపోతున్న వైపరీత్యం. ఎవరు ప్రతిఘటించాలి?
ఇష్రాత్ జహాన్ వ్యవహారం కావచ్చు..మణిపూర్‌లో మరో మహిళా బీభత్సకారిణి మరణం కావచ్చు, కశ్మీర్‌లో,కర్నాటకలోను..ఇతరేతర ప్రాంతాలలోను హతులైన వివిధ ముఠాల హంతకుల మధ్య వ్యవహారం కావచ్చు. వాస్తవాలను వక్రీకరించడం వల్ల భద్రతా దళాల నైతిక స్థైర్యం సన్నగిల్లి పోతుంది. ఇలా సన్నగిల్లడం వల్ల భద్రతా దళాలవారు విధి నిర్వహణలో వెనుకముందులాడవచ్చు. ఇది మరీ ప్రమాదం!