సంపాదకీయం
రక్షణ ‘తేజం’..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బరువు ఎక్కువ ఉందని ‘తేలికపాటి యుద్ధ విమానాలు’- లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్- ఎల్‌సిఏ- దేశ రక్షణకు అత్యంత అవసరమన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం! మన దేశం చుట్టూ చైనా దురాక్రమణ వ్యూహం బిగుసుకుంటున్న తరుణంలో మన దేశ రక్షణలో ఈ ‘ఎల్‌సిఏ’ల ప్రాధాన్యం మరింత పెరిగింది. ‘తేలిక’ యుద్ధ విమానాలను మాత్రమే కాదు, ఇతర యుద్ధవిమానాలను కూడ విదేశాలనుంచి కొనుగోలు చేయవలసి రావడం డెబ్బయి ఏళ్లకు పైగా ‘స్వతంత్ర భారతం’లో కొనసాగిన వైపరీత్యం. దశాబ్దుల తరబడి మన ‘సమర పటిమ’ను నిలదీసిన ఈ వైపరీత్యం చరమదశకు చేరుతుండడం స్వాభిమాన భారతీయులందరికీ హర్షం కలిగిస్తున్న పరిణామం. మన దేశంలోనే మనం నిర్మించుకున్న ‘తేజస్’ యుద్ధ విమానాలు పెద్దఎత్తున రక్షణ దళాలలో ప్రవేశించడానికి రంగం సిద్ధంకావడం ఈ హర్షణీయ పరిణామం! ప్రభుత్వరంగ రక్షణ ఉత్పత్తుల సంస్థ ‘హిందూస్థాన్ ఎయిరో నాటిక్స్ లిమిటెడ్’- హెచ్‌ఏఎల్- నిర్మించిన ఎనబయి మూడు ‘తేజస్’- తేజస్ ఎమ్‌కెఒన్‌ఏ- గగన సమర శకటాలను కొనుగోలుచేయాలని ‘రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి’- డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్- డిఏసి-వారు బుధవారం నిర్ణయించారట! అయితే ఈ విమానాల కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఉత్తర ప్రత్యుత్తరాలు 2016 నవంబర్ నుంచి స్తంభించి ఉండడం విచిత్రమైన వ్యవహారం. ఈలోగా విదేశాలనుంచి యుద్ధవిమానాలను కొనుగోలు చేయడానికై భారీ ఒప్పందాలు కూడ కుదిరిపోయాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చి వెళ్లిన సందర్భంగా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల- దాదాపు మూడు బిలియన్‌ల అమెరికా డాలర్ల- విలువైన గగన సమర శకటికల- హెలికాప్టర్‌ల-ను అమెరికానుంచి మన దేశం కొనుగోలు చేయడానికి అంగీకారం కుదిరింది. వీటిలో ‘ఎమ్‌హెచ్‌సిక్స్ టీఆర్’ రకానికి చెందిన ఇరవై నాలుగు ‘గగన శకటికల’ను నౌకాదళాలలోను ఆరు ‘అప్పచ్చీ’ రకం హెలికాప్టర్‌లను సైనిక దళాలలోను ప్రవేశపెట్టనున్నారట! మన ‘తేజస్’ విమానాలు మన రక్షణ బలాలకు ఉపయోగపడడం ఆనందకరం... కానీ సమాంతరంగా విదేశీయ రక్షణ శకటాలు, సమర సామగ్రి పదింతలుగా దిగుమతి అవుతుండడం ‘స్వయంసమృద్ధి’ వ్యవస్థ ఇప్పటికీ ‘గహన కుసుమం’గా మారి ఉన్న తీరునకు నిదర్శనం!
ఇదే సమయంలో మన దేశం ఫ్రాన్స్‌నుంచి ముప్పయి ఆరు ‘రాఫెల్’ రకం యుద్ధ విమానాలను కొనుగోలు చేయవలసి వచ్చింది. ఒక్కొక్క యుద్ధ విమానం ధర పదహారువందల కోట్ల రూపాయల కంటె ఎక్కువే! రష్యానుంచి కూడ మన దేశం 2016 తరువాత భారీగా యుద్ధసామగ్రిని ప్రత్యేకించి ‘సమర గగన శకటాల’- కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్-ను కొనుగోలు చేసింది. 2016 అక్టోబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం మన దేశం రష్యానుంచి దాదాపు డెబ్బయి ఐదువేల కోట్ల రూపాయల యుద్ధ శకటాలను కొనుగోలు చేస్తోంది. వీటిలో శత్రువుల గగన శకటాలను ధ్వంసం చేయగల ‘ఎస్-400’ ‘గగన రక్షణ’ వ్యవస్థ. నాలుగు ‘గ్రిగోరివిచ్’ యుద్ధనౌకలు ప్రధానమైనవి. ఈ యుద్ధ నౌకలలో రెండింటిని రష్యా మనకు విక్రయించడం, మరో రెండింటిని మన దేశంలోనే తయారుచేసి ఇవ్వడం ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం! రష్యానుంచి కొనుగోలు చేస్తున్న ‘సమర ఉపకరణాలు’ మన దేశానికి చేరడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ‘విక్రమాదిత్య’ విమాన వాహక యుద్ధనౌకను కొన్న తరువాత, ఆ నౌక మన దేశానికి రావడానికి దాదాపు పదేళ్లు పట్టింది. కొనే్నళ్లపాటు రష్యా వాడుకున్న తరువాత ఈ నౌకను మన దేశం కొనుగోలుచేయడం నిజానికి మన రక్షణ పటిమకు అవమానకరమైన పరిణామం! రష్యా ప్రభుత్వం ఇలా సమర శకటాలను, యుద్ధసామగ్రిని మన దేశానికి సరఫరాచేయడంలో జాప్యం చేస్తుండడానికి కారణం క్రీస్తుశకం 1991లో రష్యాలో కమ్యూనిస్టు నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నం అయిన నాటినుంచి ప్రారంభమైన పరిణామక్రమం! అంతవరకు కేవలం రష్యావద్ద అత్యధిక యుద్ధసామగ్రి కొన్న మన దేశం 2000వ సంవత్సరం తరువాత అమెరికావద్ద, ఐరోపా వద్ద కూడ భారీగా కొనుగోళ్లు జరుపుతోంది. ఇదీ రష్యా ఆగ్రహానికి కారణం!! విదేశాలపై ఆధారపడడం ఆధారపడినంతవరకు ఇలాంటి రక్షణ వైపరీత్యాలు కొనసాగుతూనే ఉంటాయన్నది గ్రహించవలసిన పాఠం...
శస్త్ర విద్యలు అస్త్రప్రయోగాలు మన దేశంలో అనాదిగా పరిఢవిల్లడం చరిత్ర. ఈ చరిత్రకు విదేశీయులు మన దేశాన్ని దురాక్రమించిన సమయంలో గ్రహణం పట్టింది! క్రీస్తుశకం ప్రారంభం కావడానికి పూర్వం నాలుగైదు శతాబ్దులవరకు మన రక్షణ పాటవం ప్రపంచ ప్రసిద్ధం. సైనికులు సమరవీరులు మాత్రమేకాక శస్త్రాస్త్ర ప్రయోగాలు చేయగలగిన పౌరులు సైతం మన దేశపు సరిహద్దులను రక్షించడం సహస్రాబ్దుల చరిత్ర. బ్రిటన్ బీభత్స ‘పాలన’కొనసాగిన సమయంలో ‘హరవిలాస శారద’అన్న న్యాయ కోవిదుడు ‘బాల్య వివాహాల నిషేధ శాసనానికి’ రూపకల్పన చేశాడు అది ‘శారద చట్టం’ పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈ హరవిలాస శారద గొప్ప జాతీయ చరిత్రకారుడు. ‘హిందూ సుపీరియారిటీ’- హైందవ ఔన్నత్యం- అన్న పేరుతో ఆయన వ్రాసిన చరిత్ర గ్రంథంలో ప్రాచీన భారతంలో పరిఢవిల్లిన ఆయుధ విద్య గురించి అనేక వివరాలున్నాయి. ఈ గ్రంథం ఇప్పటికి నూట పదహైదు సంవత్సరాల క్రితం 1905లో మొదటిసారి ముద్రితమైంది. ‘‘క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలోను అంతకు పూర్వం కూడ మన దేశంలోకి చొరబడడానికి యత్నించిన గ్రీసు దేశపు బీభత్సకారులు ‘తక్షశిల మహావిద్యాలయం’ జోలికి మాత్రం వెళ్లలేదు. దాదాపు పదివేల మంది విద్యార్థులకు, వెయ్యిమంది ఆచార్యులకు నిలయమైన ఈ మహా విద్యాలయంలోకి గ్రీసు దేశపు హంతకుల కంటె పూర్వం ‘మిశ్రీ’- నేటి ఈజిప్ట్- ప్రాంతంనుంచి వెడలిన బీభత్సకారులు చొరబడ్డారు...’’ అన్నది ఈ గ్రంథంలోని మాట! ‘‘అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో మా ప్రవేశాన్ని విద్యార్థులు కాని ఉపాధ్యాయులు కాని పట్టించుకోలేదు! కానీ మేము విధ్వంసకాండను మొదలుపెట్టిన వెంటనే మాపై అగ్నివర్షం కురిసింది, పిడుగులు పడినాయి, మాడి మసైపోయిన సైనికులు కాక మిగిలిన వారం పారివచ్చేశాము’’అని మిశ్రీ దేశీయులు తమ బీభత్సయాత్ర భంగమైన తీరు గురించి, భారతీయులు భంగపరచిన తీరు గురించి వ్రాసుకున్నారని ‘హర విలాస శారద’ వివరించి ఉన్నాడు. ఈ వ్రాతలు చదివినందువల్లనే తాము ‘తక్షశిల’ జోలికిపోలేదని గ్రీసు బీభత్సకారులు కూడ వ్రాసుకున్నారు. ‘అలెగ్జాండర్ గ్రేటు’అనే గ్రీసు బీభత్సకారుడు మన దేశపు శివారులనుంచి వెనుదిరిగి పోవడానికి ఒక ప్రధాన కారణం కూడ ఈ మన అస్తశ్రస్త్ర పాటవం... ఆయుధ విద్య! ఈ విద్యలు కాలక్రమంలో నశించడంవల్లనే దాదాపు పనె్నండు ఏళ్ల తరువాత ‘జిహాదీలు’ తక్షశిల మహావిద్యాలయాన్ని ధ్వంసం చేశారు!!
ఇలా ఒకప్పటి మన సమర పాటవం బ్రిటన్ ముష్కరుల బీభత్స‘పాలన’ కాలంలో మరింత నశించింది!! డెబ్బయి ఏళ్లుగా విదేశాలపై ఆయుధాలకోసం మనం ఆధారపడి ఉండడానికి ఇదీ సుదీర్ఘ నేపథ్యం!! ‘తేజస్’ యుద్ధవిమానాలను స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించుకోవాలన్న పథకానికి 1983లో రూపకల్పన జరిగింది. ఈ విమానాలు తయారుకావడానికి ముప్పయి రెండేళ్లు పట్టడం కూడ చరిత్ర! 2015లో ఈ విమానాలు రూపొందాయి! ‘‘యోజనాం సహస్రేషు శనైః గచ్ఛేత్, పపీలికా...’’- వేలకొలదీ మైళ్ల దూరాన్ని ‘చీమ’మెల్లమెల్లగా నడిచి గమ్యం చేరినట్టు- ‘తేజస్’ విమానాలు కూడ ఇన్నాళ్లకు గగన సమర ప్రాంగణ ప్రవేశం చేయనున్నాయి. ఇదివరకే రక్షణ దళాలవారు నలబయి ‘తేజస్’లను కొనాలని నిర్ణయించారట... ఇప్పుడు మరో ఎనబయి మూడు!