సంపాదకీయం

తమిళుల అమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించడం చెరగని చారిత్రక విషాద చిహ్నం, తమిళ జన హృదయంలో ఏర్పడిన శూన్యం.. తమిళనాడు రాజకీయాలకు మాత్రమే ఆమె పరిమితం కాలేదు. భారత జాతీయ రంగ స్థలిని సైతం ప్రభావితం చేసిన, ప్రకంపనలకు గురి చేసిన రాజకీయ విప్లవం జయలలిత జీవన ప్రస్థానం! 1980వ దశకం నుండి ముప్పయి ఐదేళ్లకు పైగా తమిళనాడు రాజకీయ కేంద్ర బిందువు జయలలిత. విజయంలోను, పరాజయంలోను, రాజకీయంలోను అశేష ప్రజల అభిమానానికి, సానుభూతికి గౌరవ మర్యాదలకు ఆమె పాత్రమైంది! జయలలిత విజయం తమ వ్యక్తిగత విజయంగా పొంగినవారు, ఆమెకు కలిగిన బాధ తమదిగా అనుభూతి చెంది కుంగిపోయినవారు లక్షల సంఖ్యలో ఉండడం ఆమె సాధించిన విజయం. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు ఆమె చలనచిత్ర రంగాన్ని ఉర్రూతలూగించింది. అమరశిల్పి జక్కన్న వంటి చిత్రాల్లో కొద్ది నిముషాలసేపు తళుక్కుమని మెరిసిన జయలలిత ఆ తరువాత దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ నాయికగా ఎదిగిపోయింది! ‘శ్రీకృష్ణ సత్య’ చిత్రంలో ఆమె సత్యభామ కావడం ఆ తరువాత నిజ జీవితంలో రాజకీయ కథానాయిక కావడానికి తొలి సూచకం. చలనచిత్రం రంగంలో వలెనే రాజకీయ రంగంలో కూడ ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. తమిళ చలనచిత్ర నటుడు, అన్నాద్రవిడ మునే్నత్ర కజగం స్థాపకుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా 1977 నుంచి పదకొండేళ్లు తిరుగులేని విజేతగా వెలిగినవాడు ఎమ్‌జి రామచంద్రన్.. ఎమ్‌జిఆర్‌ను అభిమానించిన, ఆరాధించిన లక్షల అభిమానులలో ఒకర్తెగా, తమిళ రాజకీయాలలో చిరుకిరణంగా తళుక్కుమన్న జయలలిత ఆ తరువాత ప్రభావ మండలంగా విస్తరించడం మూడు దశాబ్దులకు పైబడిన చరిత్ర.. ఎమ్‌జిఆర్ సరసన చలనచిత్ర కథానాయకిగా అభిమానులను అలరించిన జయలలిత ఆయనకు రాజకీయ వారసురాలిగా ఎదగడం ఈ ప్రభావ చరిత్ర! తమిళనాడులో 1960వ దశకంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్నాదొరైకి తమిళులు బ్రహ్మరథం పట్టేవారు, ఆయనకు సంబంధించిన ఆనందంలో, విషాదంలో లక్షలమంది భాగస్వాములయ్యేవారు! ఎమ్‌జి రామచంద్రన్‌కు కూడ జనం అదే రీతిలో అభిమాన నీరాజనాలు సమర్పించారు. ఎమ్‌జి రామచంద్రన్ అనంతర కాలంలో ఇలాంటి గౌరవం, ఘనత దక్కించుకున్న రాజకీయ గరిమ జయలలితది! ఎమ్‌జి రామచంద్రన్ జీవించిన సమయంలోను, ఆయన మరణం తరువాతా జయలలిత సొంత పార్టీలోనే తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది, వ్యతిరేకతను అతిగమించవలసి వచ్చింది! అనుకూల పరిస్థితులలోను, వ్యతిరేక పరిస్థితులలోను సమాన ధైర్యంతో ముందుకు నడవగలిగిన ‘పురుచ్చి తలైవీ’ జయలలిత! నాయకత్వంపై తిరగబడడానికి, నాయకత్వం వహించడానికి జయలలిత ‘ప్రతీక’గా మారడం ద్రవిడ రాజకీయాలను కొత్తమలుపును తిప్పిన పరిణామక్రమం!
ఈ పరిణామక్రమం జయలలితకు ఎమ్‌జిరామచంద్రన్ నుంచి లభించిన రాజకీయ వారసత్వం. అన్నాదొరై అనంతర కాలంలో ఎమ్‌జి రామచంద్రన్ ద్రవిడ మునే్నత్ర కజగం-డిఎమ్‌కె-నాయకత్వంపై తిరుగుబాటు చేసాడు.. పార్టీనుంచి బహిష్కృతుడైనప్పటికీ అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం-ఎడిఎమ్‌కె-ను స్థాపించి తమిళనాడు రాజకీయాలకు కేంద్ర బిందువయ్యాడు. ఎమ్‌జి రామచంద్రన్ అనంతర కాలంలో జయలలిత అన్నాడిఎమ్‌కె అధిష్ఠానంపై తిరుగుబాటు చేయగలగడం చారిత్రక పునరావృత్తం! ఎమ్‌జి రామచంద్రన్ బతికి ఉండిన సమయంలోనే జయలలితను పార్టీ ప్రచార కార్యదర్శి-ప్రాపగాండ సెక్రటరీ-పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నించిన సంస్థాగత వ్యతిరేకులు ఆయన మరణం తరువాత ఆమెకు ముఖ్యమంత్రి పదవిని దక్కనివ్వలేదు! ప్రజల అభిమానానికి అమితంగా పాత్రమైన జయలలిత నిరాశ చెందలేదు. ప్రజాభీష్టం లెక్కచేయని పెద్దలపై ఆమె తిరుగుబాటు చేసింది. ఆమె చేసిన తిరుగుబాటు తమిళ రాజకీయాలలో మరో మలుపు. ఈ తిరుగుబాటు ఫలితంగా జానకీ రామచంద్రన్ నాయకత్వంలోని అన్నాడిఎమ్‌కె ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. 1989 చివరి వరకు కొనసాగవలసి ఉండిన అన్నాడిఎమ్‌కె ప్రభుత్వం 1988లోనే కుప్పకూలిపోయింది! అన్నాడిఎమ్‌కెలో చీలిక ఫలితంగా 1989 జనవరి ఎన్నికలలో ఎమ్.కరుణానిధి నాయకత్వంలోని డిఎమ్‌కె విజయం సాధించింది! కానీ, జానకీ రామచంద్రన్ నాయకత్వంలోని పార్టీ ఎన్నికలలో తుడిచిపెట్టుకునిపోవడం జయలలిత రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు! జయలలితను ఎమ్‌జిఆర్ రాజకీయ వారసురాలిగా ఆ ఎన్నికల్లో జనం గుర్తించారు. ఆ తరువాత ఎదురులేని నాయకురాలిగా అన్నాడిఎమ్‌కెలో జయలలిత ఎదిగింది. తమిళనాట ‘అమ్మ’గా గుర్తింపు పొందింది. అన్నాడిఎమ్‌కె అఖిల భారత అన్నాడిఎమ్‌కెగా మారింది. ఆ పార్టీ అఖిల భారత స్థాయికి విస్తరించకపోయినప్పటికీ జయలలిత జాతీయ స్థాయికి ఎదగడం తరువాతి కథ. ఎమ్‌జి రామచంద్రన్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి జానకీ రామచంద్రన్ కూడ జయలలిత నాయకత్వాన్ని అంగీకరించి తన వర్గాన్ని జయలలిత పార్టీలో విలీనం చేయడం ఈ కథ!
ఉజ్వల ప్రతిష్ఠ, విపరీతమైన అప్రతిష్ఠ జయలలిత రాజకీయ జీవనాన్ని సమాంతరంగా ఆవహించాయి. ఈ సమాంతర విన్యాసాల్లో స మానత్వం గోచరించడమే ఆమె జీవన సాఫల్య గాథ. ప్రజల అభిమానం ఈ సమానత్వం! చెన్నయి అ పోలో వైద్యశాల వద్దకు వెల్లువెత్తిన జనసముద్రం గతంలో జైళ్ల వ ద్దకు వెల్లువెత్తింది! ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అభియోగం ఆమెను ఏళ్ల తరబడి వెంటాడింది! న్యాయస్థానాల తీర్పులు ఆమెను దోషిగా నిర్ధారించిననాడు, నిరపరాధిగా నిగ్గు తేల్చిననాడు సమానంగా ఈ జన అభిమాన సాగర తరంగాలు ఆమెను ముంచెత్తాయి. అభియోగం ధ్రువపడి ఆమె జైలుకు వెళ్లినప్పుడు ఈ జన హృదయం మాత్రం ఆమెను నిర్దోషిగానే భావించింది, ‘అమ్మ’గా ప్రతిష్ఠించుకుంది. అభియోగగ్రస్తులైన ముఖ్యమంత్రులెందరో పదవులకు రాజీనామా చేశారు, జైళ్లకు వెళ్లారు. కానీ వారి వెంట వెళ్లని జనం జయమ్మ వెంట జైళ్లవరకు వెళ్లారు! ఆమె ఓడితే అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆమె గెలిస్తే అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆమె నిర్బంధం అనేకమంది అభిమానుల ఆత్మాహుతికి కారణమైంది. ఆమె నిర్దోషిగా కర్నాటక హైకోర్టులో ధ్రువపడడం ఆనంద జన తరంగాలను సృష్టించింది! ఉత్థాన పతనాలలో, జయాపజయాలలో జయలలిత వెంట జనం.. ఇదీ తమిళనాట మూడు దశాబ్దుల రాజకీయ ఇతిహాసం!
జాతీయస్థాయిలో జయలలిత పోషించిన భూమిక ప్రభుత్వాలను నిర్మించింది, ప్రభుత్వాలను పడగొట్టింది, 1998 ఎన్నికల తరువాత అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడడానికి జయలలిత సమర్ధన కీలకమైంది. ఏడాది తరువాత జయలలిత ఆగ్రహించడం వాజపేయి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ఏకైక కారణం! ఐదు ఏళ్ల మనుగడ సాగించవలసిన ప్రభుత్వం ఏడాది తరువాత కూలిపోవడం విచిత్ర చరిత్ర! ఈ వైచిత్రికి రూప శిల్పి జయలలిత! 1991లో, 2001లో, 2011లో శాసన సమర విజేతగా నిలిచి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత ఆమెది! ప్రభుత్వం పట్ల సహజంగా ఏర్పడే వ్యతిరేకతను అతిగమించి 2016లో మళ్లీ ఘనవిజయం సాధించిన గరిమ ఆమెది. మహిళా రాజకీయ వేత్తలలో ఆమె అద్వితీయ, నిరుపమాన...